ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థినిగా పాల్వాయి శ్రవంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. పాల్వాయి శ్రవంతి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. ఈ మేరకు సీఈసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ముకుల్ వాస్నిక్ పేరిట ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ..మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి శ్రవంతి పేరును ఖరారు చేశారని, మునుగోడు బైపోల్లో ఆమె పోటీ చేయనున్నారని ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇప్పటి వరకు పార్టీ శ్రేణుల్లో ఉన్న సందిగ్ధత తొలగిపోయినట్లు అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి..బీజేపీ అభ్యర్థిగా మరోసారి మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పోటీలో ఎవరిని దించాలా? అని రాష్ట్ర పార్టీ నేతలు సమాలోచనలు చేశారు. అభ్యర్థి ప్రకటన ఆలస్యమైతే పార్టీకి నష్టం జరిగే ఛాన్స్ ఉందని భావించిన అధిష్టానం.. ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన పాల్వాయి శ్రవంతిని, మునుగోడు ఉప ఎన్నికల్లో నిలుపుతున్నట్లు ప్రకటించింది. చాలా రోజుల పాటు తర్జన భర్జనలు పడి చివరకు పాల్వాయి స్రవంతిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.



