మీరు చెప్పే మాటలకు కాలం చెల్లింది…

  • షాద్ నగర్   నియోజకవర్గం  లో   కాంగ్రెస్ గెలుపు ఖాయం!!!
  • షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
  • కొత్తూర్ మండలం జేపీ దర్గా, ఇనుల్ నర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారం
  • వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు
షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 26:  టిఆర్ఎస్ పార్టీ  చేస్తున్న మోసాలు,అబద్ధాలు చెప్పడమే అలవాటుగా, విష ప్రచారం చేయడమే పనిగా పెట్టుకునిఇన్నాళ్లు షాద్ నగర్  ప్రజలను మభ్యపెట్టారనీ ఇక మీ కథలకు కాలం చెల్లింది.. మీ మాయ మాటల వెనుక మర్మం ప్రజలకు అర్థమైందనీ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం జేపీ దర్గా, ఇనుల్ నర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్ధి వీర్లపల్లి శంకర్, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు, వివిధ పార్టీల వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి వీర్లపల్లి శంకర్ లు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని వారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను వారికి వివరిస్తూ రానున్న ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వారిని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి ఎలాంటి న్యాయం జరగలేదని వారన్నారు న్యాయం జరిగిందంటే కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికి న్యాయం జరగలేదని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడిని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకుపోతామని వారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు హరినాద్ రెడ్డి,రవి కుమార్ గుప్తా, రియాజ్, హమేద్ తదితరులు హాజరయ్యారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *