రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో గెలుస్తా
సీఎం కేసీఆర్ పాలన ప్రజా సంక్షేమానికి స్వర్ణయుగం
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు
రానున్న శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రి కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిసి బంధు పధకం కింద ఎంపిక చేసిన 6వందల లబ్దిదారులకు చెక్కులను పంపిణి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాను పోటీ చేసినఫ•డు వోట్ల కోసం మందు పోయలేదని,పైసలు పంచలేదని అన్నారు.రానున్న ఎన్నికల్లో సైతం తాను పైసలు పంచబోనని,ప్రజల ఆశీస్సులుంటే గెలుస్తానని,లేకపోతే ఇంట్లో కూర్చుంటానని,పైజలు పంచే చిల్లర రాజకీయాలు తాను చేయబోనని అన్నారు.వోట్ల కోసం విపక్షాల నేతలు వచ్చినప్పుడు ప్రజలు నిలదీయాలని,యాభై సంవత్సరాలుగా చేయని పనులు ఇప్పటికిప్పుడు ఎట్లా చేస్తారని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.పనిచేసే పార్టీలను,ప్రభుత్వాలను కాపాడుకోవాలని,వోట్ల కోసం మందుపోసి,పైసలు పంచే వారిని నమ్మవద్దని కోరారు.ప్రజల సంక్షేమం కోసం తాను కట్టుబడి ఉన్నానని,సిఎంగా కెసిఆర్ ఉన్నంత కాలం రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ధోకా లేదని అన్నారు.మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపాయి.
సీఎం కేసీఆర్ పాలన ప్రజా సంక్షేమానికి స్వర్ణయుగం
సీఎం కేసీఆర్ పాలన ప్రజల సంక్షేమానికి స్వర్ణయుగంగా మారిందని రాష్ట్ర మున్సిపల్ ,ఐటి శాఖల మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా బిసి బంధు పథకం కోసం ఎంపిక చేసిన 6 వందల మందికి చెక్కుల పంపిణిని కలెక్టరేట్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి కె కెటిఆర్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. శతాబ్దాలుగా అత్యంత అట్టడుగున ఉన్నది దళితులు. దళితుల అభివృద్ధి కోసం రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిసున్నామని, బీసీ, ఎంబీసీల్లోని 14 కులవృత్తులు చేసుకునేవారికి రూ. లక్ష సాయం అందిస్తున్నామని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెలలో 600 మంది లబ్దిదారులకు రూ. లక్ష చొప్పున సాయం చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి నెల నియోజకవర్గానికి 300 మందికి రూ. లక్ష చొప్పున సాయం ఇస్తామన్నారు. జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 10 వేల మందికి లక్ష సాయం తప్పకుండా అందించి తీరుతాం. దళితులు, బీసీలకు అందిస్తున్న మాదిరిగానే మైనార్టీలకు కూడా రూ. లక్ష ఆర్థిక సాయం త్వరలోనే అందజేస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న సాయం తిరిగి కట్టాల్సిన అవసరం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.కడుపులో ఉన్న బిడ్డ నుంచి బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుంచి మొదలుకుంటే.. వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. పేదల మీద కేసీఆర్‌కు ఉన్న ప్రేమ ఇతరులకు ఎవ్వరికీ లేదన్నారు. ప్రతి పథకం లబ్దిదారులకు నేరుగా అందుతుందని, ఎవరూ అడక్కున్నా.. ప్రతిపక్షాలు డిమాండ్ చేయకున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు కాపాడుకుంటారని సీఎం కేసీఆర్ చెప్పారు. భర్త చనిపోతే భార్య పేరు మీదికి ఆసరా పెన్షన్ వెంటనే మార్పు చేయాల్సి ఉందని, గృహలక్ష్మి పథకం రూ. 3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని అని కేటీఆర్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ,వేమువాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,అడిషనల్ కలెక్టర్లు సత్యప్రసాద్,ఖీమ్యానాయక్,ఎస్పీ అఖిల్ మహాజన్‌లతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.




