బిజెపి నేతల తప్పిదానికి… దేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలి ప్రధాని మోడీకి కెటిఆర్‌ ‌ట్వీట్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ తప్ప దేశం కాదని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

విద్వేషం వెదజల్లుతున్నందుకు తొలుత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. తాజాగా మహమ్మద్‌ ‌ప్రవక్తపై బీజేపీ నేతలు నుపూర్‌ ‌శర్మ, నవీన్‌కుమార్‌ ‌జిందాల్‌ ‌తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌, ‌ఖతార్‌, ‌కువైట్‌ ‌దేశాలు ఏకంగా భారత రాయబార్లకు సమన్లు పంపి తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. భారత్‌ ‌క్షమాపణలు చెప్పాలని గల్ఫ్ ‌దేశాలు డిమాండ్‌ ‌చేసిన విషయం విధితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *