బిఆర్‌ఎస్‌ కు మున్సిపల్‌ చైర్మన్‌ బృందం రాజీనామా ?

నేడో .. రేపో కాంగ్రెస్ పార్టీ లో చేరిక

ఇల్లందు ,ప్రజాతంత్ర ,నవంబర్‌ 8 : ఇల్లందు మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తోపాటు ఆయన వెంట ఉన్న కౌన్సిలర్‌ బృందం టిఆర్‌ఎస్‌ కు భారీ షాక్‌ ఇస్తూ నేడో రేపు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్లు ఇల్లందులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ అసమ్మతి నేతలు కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చలు జరిపి స్పష్టమైన హామీని సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా పట్టణంలో టిఆర్‌ఎస్‌ పార్టీలో నెలకొన్న అసమ్మతి సెగ నేడు రాజీనామా కు దారి తీయడంతో పాటు పార్టీ మారే దిశగా చేరుకోవడం పట్టణ బిఆర్‌ఎస్‌ నేతలను విస్మయానికి గురిచేస్తుంది. ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె భర్త వ్యవహార శైలి నచ్చక మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మలపాటి వెంకటేశ్వరరావు నేరుగా అభ్యర్థి ప్రకటన సమయంలో హరిప్రియ నిరసనగలమెత్తారు. నాటినుండి ఎమ్మెల్యే వర్సెస్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గా మారిపోయింది. ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న అంత విధంగా మారిపోయి రోజుకు రకంగా మలుపు తిరుగుతూ చివరికి పార్టీ మారే వరకు వచ్చింది.. ఏదేమైనా ఒక్కొక్కరుగా టిఆర్‌ఎస్‌ ని వీడుతుండడంతో ఎమ్మెల్యేతో పాటు పార్టీ నాయకులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *