“బంగారు తల్లులకు”బాత్ రూములు కట్టరా ?

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో మాలిక వసతులు చేపట్టడానికి ఇచ్చిన ఉత్తర్వులు జిఓ ఎంఎస్ నం.5 జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కమిటీలు పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించటం కోసం పది అంశాలుగా శ్రీకారం చుట్టారని చెప్తున్నాడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎంతో ప్రశంసనీయమైనదని గొప్పలు గుప్పిస్తున్నారు ఇంత వరకు బాగానే వుంది రాష్ట్రంలో జూన్ 12 నుండి బడి గడప తొక్కుతున్నబంగారుతల్లు లకు బాత్ రూమ్ సౌకర్యాలు కల్పించడానికి ముఖ్యమంత్రి గారికి మనసేందుకు రావడం లేదనివిద్యార్థులుప్రశ్నిస్తున్నారు ?

రాష్ట్రంలో ప్రభుత్వపాఠశాలలు కళాశాలలు హాస్టల్స్ లలో సుమారు 30 లక్షల మంది విద్యార్థినిలు విద్యను అభ్యసించున్నారు. వీరిలో ప్రతి ముగ్గురిలో ఒక్కరు మాత్రమే మూత్రశాలల సౌకర్యం ఉన్నదని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. సుమారుగా రాష్ట్రంలో మొత్తం 43,293 వరకు ఉన్న పాఠశాలలో 35 వేలకు పైగా పాఠశాలలకు మూత్రశాలలు లేవు మూత్రశాలలు ఉన్న విద్యా సంస్థల్లో కూడా ఉపయోగించడానికి పనికిరాకుండా తయారైనవి నీటి సౌకర్యం లేని కారణంగా అనేక విద్యాసంస్థల్లో మూత్రశాలకు తాళాలు పడివున్నాయి. మూత్రశాలలు నీటి సౌకర్యం కలిగివున్న విద్యా సంస్థకు స్కావెంజర్ పోస్ట్ లేని కారణంగా తీవ్రమైన దుర్వావసనలు వస్తున్నాయి. విద్యాసంస్థలకు హాజరవుతున్న విద్యార్థులు తగినంత మంచినీరు తీసుకోవడం లేదు. దీని వలన వారు అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. పట్టణ నగర ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్షినీలకు మూత్రశాలలులేని కారణంగా చెప్పుకోలేని బాధలకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో చదువుతున్న విద్యార్థినీలు చెట్టు పుట్టలు చాటున చేసుకోవలసిన పరిస్థితి దాపురించింది.

కొన్ని చోట్ల విద్యార్థినీలు గోనె బస్తాలతో తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మించుకుంటున్నారు. సంక్షేమ హాస్టల్స్ లో ఉండి చదువుకుంటున్న విద్యార్ధినులకు సైతం తగినన్ని మూత్రశాలు లేవు. రాష్ట్రంలో రెండు వేల హాస్టల్స్ ప్రైవేటు భవనంలో నడుస్తున్నాయి. ఈ భవనాలలో 200 మంది విద్యార్థులకు రెండు బాత్‌రూములు మాత్రమే ఉంటున్నాయి. కొన్నిహాస్టల్స్ లోవిద్యార్థినుల పాత చున్నీలతో మూత్రశాలలనుఎం నిర్మించుకుంటున్నారు. మరికొన్నిచోట్ల కాలకృత్యాలు తీర్చుకొనుట కొరకు కోడి కూతకన్న ముందే లేచి చెరువులు వాగులు చెంతకు చేరుతున్నారు. ఇలా ఆరుబయటకు వెళుతున్నప్పుడు పదుల సంఖ్యలో విద్యార్థినులు విష సర్పాల కాటుకూ నీటి ప్రవాహంలో పడి మృతి చెందుతున్నారు. కొన్ని జిల్లాలలో పాఠశాలలకు వొస్తున్న మహిళా టీచర్లకు సైతం మూత్రశాలల సౌకర్యం లేక కేవలం మూత్రశాలల కొరకే స్కూల్ పక్కన గల ఇంటిని అద్దెలకు తీసుకుంటున్నారు.77 సంవత్సరాల పాలనలో భావి పౌరులు మరుగుదొడ్లు లేక బహిరంగ ప్రదేశాలలో కాల కృత్యాలు తీర్చుకోవటం స్వాతంత్రం భారతదేశంలో సిగ్గుపడాల్సిన విషయం.

పాఠశాలలకు హాజరవుతున్న బాలికల సంఖ్య తక్కువ.. ఆ కాస్త మంది కూడా చదువు నుండి జారిపోవడనికి మూత్రశాలల సౌకర్యం లేకపోవడం ఒక ప్రధాన కారణం అని అనేక సర్వేలు తెలుపుతున్నాయి. అయితే మన పాలకులకు మూత్రశాలలు నిర్మించాలనే స్పృహ కలగడంలేదు. పిడికెడు మంది కోలువుదీరిన మంత్రుల ఎమ్మెల్యే వారు ఉండే భవనంలో ముత్రశాలలకు లక్షల వరకు ఖర్చు పెట్టారు కోట్ల నిధులు వెచ్చించి మూత్రశాలలు నిర్మించినట్లు ఈ మధ్య మీడియాలో ప్రసారమైంది. కొంతమంది కోసం ప్రజా ధనాన్ని మంచినీళ్లులాగా ఖర్చు చేసే పెద్దలు. లక్షలాది మంది పేదింటి బిడ్డలకు మూత్రశాలలు నిర్మించటానికి మనసు ఒప్పుడం లేదు. విద్యాసంస్థలలో మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకపోతే కోర్టు తీవ్రంగా మందలిస్తూ ఆరు నెలలలోఅన్నివిద్యాసంస్థ లకు మూత్రశాలలూ మంచినీటి సౌకర్యం కల్పించాలని మళ్లీ ఆదేశించింది. అయినా ప్రభుత్వం కాళ్లు కదపలేదు.. ఆడపిల్లగా పుట్టీనందుకా మాకు ఇంత ‘ఘోష? అంటూ విద్యార్థినీలు నిలదీస్తూన్నా స్పందించే నాధుడే లేడు. మన పక్కనే గల తమిళనాడు, పంజాబ్ , ఉత్తరప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం విద్యా సంస్థలలో మౌలిక వసతులు కల్పించడంలో బాగా వెనకబడిపోయిందని జాతీయ సర్వేలు తెలుపుతున్నాయి.

విద్యహక్కు చట్టం వొస్తే మన విద్యా సంస్థలకు సకల సౌకర్యాలు వొస్తాయని ప్రభుత్వాలు చెప్పాయి. ఈ చట్టం అమల్లోకి వొచ్చి 14 సంవత్సరాలు పూర్తయ్యింది. అయినా పాఠశాలల్లో ఈ మౌళికమైన మార్పులు జరగలేదు. మూత్రశాలల సౌకర్యం మెరుగుపడలేదు. పాలకులకు వోట్లు రాల్చే పథకాల పైన ఉన్న ప్రేమ బాలికల విద్యా భవిష్యత్తుపై లేకపోవడం దురదృష్టకరం.. చిట్టి తల్లులకు చింతలు తీర్చేవారు లేకపోవడం ఘోరం.. మూత్రశాలల సమస్యలు పరిష్కారం కోసం బంగారు తల్లులందరూ భద్రకాళులు కావాలి.. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పై ఒత్తిడి తెచ్చి కనీస సౌకర్యాలకై పోరాడాలి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *