పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం

రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పోస్టర్‌ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టి

ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్‌ వైద్యంతో పాటు అన్ని రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఏంపానల్డ్‌ ఆసుపత్రిలో తక్షణమే అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూసుమంచి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాల నందు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వైద్య సాయం రూ 10 లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే అమలు చేశామన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించామన్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారని పేర్కొన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకు పెంచి అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల వాగ్దానంలో మిగతా గ్యారెంటీలను రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌, డీఎంహెచ్వో మాలతి, మండల వైద్యాధికారి కిషోర్‌, ఎంపిడివో రమాదేవి, తహసీల్దార్‌ సంపత్‌ కుమార్‌, ఎంపివో రామచంద్రరావు, స్థానిక సర్పంచ్‌ చెన్న మోహన్‌ రావు, కూసుమంచి ఎంపీటీసీ మాదాసు ఉపేందర్‌ రావు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *