పదిమంది హైకోర్టు కొత్త జడ్జీల ప్రమాణం చేయించిన చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సతీశ్‌ ‌చంద్రశర్మ

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 24 : హైకోర్టుకు నూతనంగా నియమితులైన పది మంది న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సతీశ్‌ ‌చంద్రశర్మ నూతన జడ్జిలతో ప్రమాణం చేయించారు.

ప్రమాణం స్వీకారం చేసిన వారిలో కాసోజు సురేందర్‌, ‌సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌కుమార్‌, ‌జువ్వాడి శ్రీదేవి, వెంకట శ్రవణ్‌కుమార్‌, ‌జీ అనుపమ చ్రకవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏ సంతోష్‌రెడ్డి, డాక్టర్‌ ‌డీ నాగార్జున్‌ ఉన్నారు.కొత్తగా నియమితులైన పది మంది జడ్జిలతో హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ప్రస్తుతం 19 మంది జడ్జిలు సేవలు అందిస్తున్నారు. కాగా, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉన్నది. అయితే హైకోర్టులో ఒకేసారి పది మంది న్యాయమూర్తులు నియమితులవడం ఇదే మొదటిసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *