దేశంలో రాజకీయ పరిణతి రాలేదు

ప్రజాస్వామ్యం పరిణతి చెందిన దేశాలు అభివృద్ధి చెందాయి
ఎన్నికలలో నాయకులు కాదు ప్రజలు గెలవాలి
తెలంగాణలో మూడోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే…
మంథని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తున్నా దేశ ప్రజలలో రాజకీయంగా పరిమితి చెందలేదని, ఎన్నికలు రాగానే ఆగమాగం అవుతూ అఙవండాలు, ఆరోపణలు సంధిస్తు రాజకీయ పార్టీలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు అన్నారు. మంగళవారం పెద్దపెల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాషఱంజూ…ప్రజాస్వామ్యం పరిణతి చెందిన దేశాలు అభివృద్ధి దశలో ఉన్నాయని, మన రాష్ట్రంలో కూడా ప్రజలు ఆలోచించి విజ్ఞతతో అభివృద్ధి సంక్షేమం చేసే పార్టీలకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణాలో జరుగుతున్న ఎన్నికలలో ప్రజలు గెలిచే ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రజల చేతిలో వజ్రాయుధంగా ఉన్న వోటు రూపంలో నిర్ణయించాలని సూచించారు. నాలుగు పైసలకు ఆశపడి ఆలోచించకుండా ఎవరో చెప్పారని గుడ్డిగా వోటు వేయకుండా.. పనులు చేసే ప్రభుత్వానికి వోటు వేయాలని, వోటు మీ తలరాతను మారుస్తుందని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *