డిజిటల్‌ ‌టెక్నాలజీ, స్టార్టప్‌లలో భారత్‌ ‌దూసుకెళ్తుంది

  • అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాలి
  • దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా
  • రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం

న్యూ దిల్లీ, జూలై 25 : దేశ 75 ఏళ్ల స్వాతంత్య ్రఉత్సవాల సమయంలో..రాష్ట్రపతిగా ఎన్నిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అందరి విశ్వాసం, సంక్షేమం కోసం పాటుపడదామన్నారు. తన ఎన్నిక దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీకని, బాధ్యతల నిర్వహణకు ప్రజల విశ్వాసం బలాన్నిస్తుందని అన్నారు. ఓ సాధారణ ఆదివాసీ అయిన తనను దేశ అత్యున్నత స్థానంలో నిలబెట్టారని అన్నారు. గత రాష్ట్రపతులందరూ ఈ పదవికి వన్నె తెచ్చారని కొనియా డారు. ఈ సందర్భంగా దేశప్రజలకు ద్రౌపది ముర్ము కార్గిల్‌ ‌దివస్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. డిజిటల్‌ ‌టెక్నాలజీ, స్టార్టప్‌ ‌రంగాల్లో దేశం దూసుకెళ్తుందని ముర్ము అన్నారు. రాష్ట్రపతిగా దేశవాసులందరికీ తన సేవలు అందిస్తానన్నారు. అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాల్సి ఉందని, ‘సబ్‌ ‌కా ప్రయాస్‌ ‌సబ్‌ ‌కా కర్తవ్య్’ ‌నినాదం ముందుకు వెళ్లాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల కల సాకారం చేయాలన్నారు. ఈ సందర్భంగా దేశప్రజలకు ద్రౌపది ముర్ము కార్గిల్‌ ‌దివస్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రపతిగా తన ఎన్నిక కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక అని అన్నారు ముర్ము. ఈ గెలుపు తన ఒక్కరి ఘనత కాదని..దేశ ప్రజలందరికీ దక్కిన విజయమని అభిప్రాయపడ్డారు. పేద ప్రజలు కలలు కని.. నిజం చేసుకోగలరనేందుకు తన ఎన్నికే నిదర్శనం అని పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి ప్రసంగించిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా. భారత్‌ ’ఆజాదీకా అమృత్‌ ‌మహోత్సవ్‌’ ఉత్సవాలు జరుపుకుంటుంది. ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. 50 ఏళ్ల స్వాతంత్య వేడుకల వేళ నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. 75 ఏళ్ల ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. ఒడిశాలోని చిన్న ఆదివాసీ గ్రామం నుంచి వొచ్చి..అత్యున్నత పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు ద్రౌపది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *