గుజరాత్ లో  ఫసల్ బీమా యోజన ఎందుకు  అమలు చేయడం లేదు..

గుజరాత్ లో  ఫసల్ బీమా యోజన ఎందుకు
 అమలు చేయడం లేదు.







*బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ఫైర్
*ఎకరాకు 10 వేల నష్ట పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్, రైతు బిడ్డ అని మరోసారి నిరూపించారని ట్వీట్
*రైతుల గురించి, వ్యవసాయం గురించి బిజెపి నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లే అని విమర్శ
తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలని అడుగుతున్న బండి సంజయ్.. ముందు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పగలవా..? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దేశంలోని 10 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని  పార్లమెంట్ సాక్షిగా బీజేపీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు.  దీనిని బట్టే ఆ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేదని అర్థం కావడం లేదా..? అని పేర్కొంటూ..పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్  ఎకరాకు రూ. 10 వేలు సాయం చొప్పున, రూ. 228 కోట్లు ప్రకటించి రైతు బిడ్డనని మరోసారి నిరూపించుకున్నారు. బిజెపి నేతలకు ఇది చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరం. దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్నా ఎక్కువ సాయం చేసినట్టు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, నేడు ఆదాని ఆదాయాన్ని డబుల్ చేశారు. అనునిత్యం రైతులను క్షోభకు గురి చేస్తూ, నల్ల చట్టాలు తెచ్చి రైతులను బలి చేసిన చరిత్ర మీది.. వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత మాది. సాగు, రైతు సంక్షేమం గురించి బిజెపి నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమే.. అంటూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *