కెమికల్‌ ‌ఫ్యాక్టరీలో పేలుడు

ఒకరు మృతి.. పలువురికి గాయాలు

నల్లగొండ, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 24 : ‌జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కెమికల్‌ ‌ఫ్యాక్టరీలో రియాక్టర్‌ ‌పేలడంతో ఈ ప్రమాదం చోటుచేకున్నట్లు చెబుతున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్‌ ‌సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు ఫైర్‌ ‌సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అయితు ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆ ప్రదేశమంతా పొగతో భారీగా కమ్ముకుంది.

వెలిమినేడు సమీపంలోని హిండిస్‌ ‌రసాయన పరిశ్రమలో ఈ భారీ ప్రమాదం జరిగింది. కంపెనీలో రియాక్టర్‌ ‌పేలి ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. కంపెనీ చుట్టుపక్కల భారీగా పొగ కమ్మేసింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు ఫ్యాక్టరీ లోపలికి ఎవరిని అనుమతించటం లేదు. కాగా కంపెనీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భారీగా కమ్ముకున్న పొగతో వెలిమినేడు, పిట్టంపల్లి, బాంగోని చెర్వు, పేరేపల్లి, గుండ్రంపల్లి, పెద్దకాపర్తి సవి•ప గ్రామస్తుల భయాందోళనకు గురయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *