కాంగ్రెస్‌ ‌గెలిస్తే బిఆర్‌ఎస్‌కు కార్బన్‌ ‌పేపర్‌ ‌సర్కార్‌

  • రెండు పార్టీలు నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివి
  • ప్రజెక్టుల పేరుతో బిఆర్‌ఎస్‌ ‌నాయుకులు జేబులు నింపుకుంటున్నారు
  • బిజెపి అధికారంలోకి వొస్తే బిసి ముఖ్యమంత్రి
  • తుక్కుగూడ బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

మహేశ్వరం అర్బన్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ గెలిస్తే బిఆర్‌ఎస్‌కు కార్బన్‌ ‌పేపర్‌ ‌లాంటి సర్కార్‌ అవుతుందని, ప్రజలు ఆలోచించి భారతీయ జనతా పార్టీకి వోటు వేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సకల జనుల విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ మట్లాడుతూ.. సిఎం కేసిఆర్‌ ‌రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి ప్రారంభమైందని, రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్తికి బిఆర్‌ఎస్‌ ‌మద్దతు ఇచ్చిందని, గతంలో కాంగ్రెస్‌తో పొత్తు కూడా పెట్టుకుందని మోదీ అన్నారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్‌, ‌దుబ్బాక, జిహెచ్‌ఎం‌సిలో బిజెపి పార్టీని ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు తెలివి, సాంకేతికత, సాంప్రదాయాలు కలిగిన బిజెపి అంటే కేసిఆర్‌కు భయం అవుతుందని, కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీలు నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వారని అన్నారు.

తెలంగాణ రైతులకు ఎరువుల సబ్సిడీ అందిస్తున్నామన్నారు. వరి ధాన్యం 20 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల కొనుగోలు చేస్తామని, సుకన్య యోజన పథకంలో ఆడ పిల్లలకు ఏంతో మేలు జరుగుతుందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి తన సంకల్పంగా భావించుతున్నానని, ఏళ్ల నుండి బిసిలకు అన్యాయం జరుగుతుందన్నారు. పెట్రోల్‌, ‌డీజిల్‌పై బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వ్యాట్‌ ‌తగ్గించలేదని అన్నారు. ఎస్‌సి వర్గీకరణ బిల్లుపై అధికారులతో చర్చిస్తున్నామన్నారు. ప్రాక్ట్‌ల పేరుతో బిఆర్‌ఎస్‌ ‌పార్టీల నేతలు జేబులు నింపుకుంటున్నారని మోదీ ఆరోపించారు. ప్రజల విశ్వసనీయమైన పార్టీ బిజెపి అని అన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…1200 మంది విద్యార్థులు త్యాగాలు ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన తెలంగాణలో కెసిఆర్‌ ‌కుటుంబ పాలన కొనసాగుతుందని,  రాబోయే సార్వతిక ఎన్నికల్లో తెలంగాణ యువత, ప్రజలు, బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వోడించాలని నిర్ణయించుకుని, మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఎం పి కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డి, జిల్లా అద్యక్షుడు బొక్క నర్శింహ రెడ్డి, బి జె పి ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌, ‌నాయకులు తుళ్ల వీరేందర్‌ ‌గౌడ్‌, ‌తోకల శ్రీనివాస్‌, ‌సుధాకర్‌ ‌శర్మ రాష్ట్ర,జిల్లా నాయకులు తధితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *