ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. రు. 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా..
రు. 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం
డబుల్ బెడ్రూం ఇండ్లు తీసుకున్న వారిలో సంతోషం కనపడుతుంది
విలువైన స్థలంలో, ధనవంతులు ఉండే ప్రాంతంలో పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కేసిఆర్ ది..అని మంత్రి హరీష్ రావు అన్నారు. జీ హెచ్ ఎం సీ
 పరిధిలో ఉన్న నియోజకవర్గ లబ్ధిదారులకు శనివారం మంత్రి హరీష్ రావు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసారు.

ఇప్పుడు మంచినీళ్లకు ధర్నాలు లేవు.. తాగు నీరు సరఫరా మంచిగా జరుగుతుంది..బీజేపీ వాళ్ళు జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎన్నో చెప్పారు. ఇల్లు పోతే ఇల్లు బండి పొతే బండి ఇస్తామన్నారు.. ఏమైందీ అని పేర్కొంటూ..బండి పోతే బండి గుండు పోతే గుండు అన్నారు..బండి లేదు గుండు లేదు..డబుల్ ఇంజిన్ సర్కార్ లో ఎక్కడైనా డబుల్ డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చారా.. వీరిది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్..విలువైన ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోండి.. ఇల్లు ఇచ్చిన, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కేసిఆర్ ని ఆశీర్వదించండి.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యునిటీగా మారనుంది ..ముఖ్యమంత్రి కేసీఆర్ కు   కృతజ్ఞతలు తెలుపుదాం..అని లబ్దీ దారులకు సూచించారు. తెల్లపూర్ మున్సిపాలిటి పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ శరత్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *