ఆసిఫ్‌నగర్‌ ‌ఘటన ఎంత అవమానకరం దీనిని ఇలాగే వొదిలద్దామా: రేవంత్‌ ‌ట్వీట్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ఆసిఫ్‌నగర్‌ ‌ఘటనపై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్విటర్‌ ‌వేదికగా స్పందించారు. పోలీస్‌ ‌వాహనం ఎక్కి మందుబాబుల వీరంగం దృశ్యాన్ని ఆయన ట్విటర్‌లో షేర్‌ ‌చేశారు. ఈ దృశ్యం మన హైదరాబాద్‌లోనేనని తెలిపారు. హత్యలు, అత్యాచారాలు దాటి పోలీసు వాహనాలపై.. దాడులు చేసే స్థాయికి పరిస్థితి వొచ్చిందని ట్వీట్‌లో రేవంత్‌ ‌పేర్కొన్నారు.

ఆసిఫ్‌నగర్‌లో పోలీసు వాహనం ఎక్కి మందుబాబుల వీరంగం..హత్యలు, అత్యాచారాలు దాటి పోలీసు వాహనాలపై..దాడులు చేసే స్థాయికి పరిస్థితి వొచ్చింది. ఈ నగరాన్ని ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా..పౌర సమాజం ఆలోచన చేయాలని అంటూ రేవంత్‌ ‌ట్వీట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *