ఊడిపోయే జుట్టు ఎంత ఒత్తిన ఏముందిలే అంటాడు సినారె, అయ్యవార్లు లేక, రీసర్చ్ గ్రాంటులు, బ్లాక్ గ్రాంట్స్ లేక శ్మశాన ప్రశాంతత నెలకొన్న విశ్వవిద్యాలయాలలో ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్లని యూజీసీ ప్రకటించింది. గత పది సంవత్సరాలుగా దేశంలోని విశ్వవిద్యాలయాలలో చలనం లేకుండా పోయింది. విశ్వవిద్యాలయాల పరిస్థితి సమీక్షించుకుంటే అశాంతి, అలజడులు, సుదీర్ఘ పోరాటాలకు ప్రధాన కారణం బోధన సిబ్బంది నియామకాలే అని గ్రహించగలం. బోధన, పరిశోధన, క్రమశిక్షణ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే అధ్యాపకులను నియమించాల్సిందే. విశ్వవిద్యాలయాలకు అద్భుతాలు సృష్టించే శక్తి ఉంది, విద్యారంగంలో అత్యంత కీలకం తరగతి బోధనేనని ఉపకులపతులు గ్రహించాలి. విద్యార్థులపై తరగతి బోధన విధానం తీవ్ర ప్రభావం చూపుతుంది, అధ్యాపకులు సైతం విద్యార్థులను ప్రభావితం చేసే విధంగా బోధన విధానాలు, సామర్థ్యాలు ఉన్నతీకరించుకోవాలి. విశ్వవిద్యాలయం పరీక్షల్లో అనేక మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉంది, అలాగే వివిధ వర్శిటీల్లో అమలులో ఉన్న పరీక్షల విధానం సమగ్ర అధ్యయనం చేసి విద్యార్థులకు లాభం చేకూర్చే పద్దతిని అవలంబించుకోవాలి.
విద్యా విధానంలో నాణ్యత తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, ప్రధానంగా పాలన, ఆర్థిక వనరుల కేటాయింపు, పరిశోధన ప్రగతి, ఏపీఐ స్కోర్, పర్ఫామెన్స్ బేస్డ్ అకడమిక్ స్కోర్ వంటి కీలకాంశాలు విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నేడు స్మశాన ప్రశాంతత నెలకొని ఉంది. ఉన్నత విద్యాధికారులు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తూ వీటిలో సీట్లు భర్తీ అయిన తర్వాత మొక్కుబడిగా అడ్మిషన్లు చేపడుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో సీట్ల భర్తీ జూన్ నెలలో ముగుస్తుంది, ఇక్కడ సెప్టెంబర్ అయినా అడ్మిషన్ ప్రక్రియ మొదలవదు. పరిస్థితి ఇలాగే ఉంటే 2030 నాటికి దేశంలో 80 శాతం ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పడతాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇంజనీరింగ్ కళాశాల కనీసం ముప్పై శాతం సీట్లు భర్తీ కాక మూసివేశారు. డిప్లొమా విద్య ఇంకా దారుణంగా కేవలం 35 శాతం అడ్మిషన్లు అయింది అంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశ్వవిద్యాలయాలకు మరింత స్వేచ్ఛను అందించినప్పుడే ఉన్నత విద్య, పరిశోధన రంగంలో నాణ్యత మెరుగుపడుతుంది అలాగే దేశీయ విశ్వవిద్యాలయాలలో విద్య పరిశోధన రంగంలో అంతర్జాతీయ విద్య సంస్థలతో పోటీ పడాలంటే రీసెర్చ్ గ్రాంట్లు, మైనర్, మేజర్ ప్రాజెక్టులు రూపకల్పన చేయాలి. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో సెంటర్ ఆఫ్ పొటెన్షియల్ ఎక్సెలెన్స్ ఉన్న విభాగాలు ఒక్కటీ లేదు.
దేశంలో ఉన్నత విద్య రంగానికి కేటాయిస్తున్న నిధులు ఇతర అన్ని రంగాల కంటే అత్యల్పంగా ఉంది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో ఉన్నత విద్యారంగానికి కేటాయించే నిధులు పెంచడంతోపాటు వివిధ మార్పులకు అవకాశం కల్పించాలి . విశ్వవిద్యాలయాలు గుర్తింపులు ఇవ్వడాన్ని రద్దు చేసి, పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకు వచ్చినప్పుడు విద్యా రంగంలో నాణ్యతతో కూడిన ప్రమాణాలు మెరుగుపడతాయి. విద్యారంగానికి దశాబ్దం క్రితం వరకు ఎంతో ప్రాధాన్యం ఉండేది, విశ్వవిద్యాలయాలు సమాజ ఉన్నతికి దోహదపడే విధంగా ఉండాలి. పాఠ్య ప్రణాళిక రూపకల్పన, సిలబస్ నిర్ణయించడంలో, అమలులోకి తీసుకు రావడం అధ్యాపకుడి పాత్ర ప్రధానంగా ఉండి, జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, విలువలు పెంచేదిగా విద్య ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది అధ్యాపకులు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటిలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించడానికి ప్రైవేటు కన్సల్టెన్సీలు ఉన్నాయి. లోపం ఎక్కడుంది గ్రహించకుండా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. విద్యార్థిని కేంద్రీకృతం చేసుకొనే పద్ధతి ఈనాడు అవసరము, ఓపన్‌బేస్ ఎడ్యుకేషన్ విధానాన్ని విస్తృతపరిస్తే విద్యార్థి విజ్ఞాన స్థాయి మెరుగుపడుతుంది. సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది, అలాగే కోర్ ఇంజనీరింగ్ బ్రాంచీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కొత్తగా ప్రవేశ పెడుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లార్న్ఇంగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సెక్యూరిటీ అంశాలు అధ్యాపకులు బోధించడానికి అకడమిక్ స్టాఫ్ కాలేజీలు లేవు, అధ్యాపకులకు వీటిపై నైపుణ్యత పెంపొందించుకొని బోధిస్తే ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చు. పరిశోధన ప్రాజెక్టులు కొన్ని మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతున్నాయి, వాటికి కారణం నిధులు నిలిపివేయడం లేదా తగ్గించడం జరుగుతుంది. ప్రభుత్వం అశాస్త్రీయమైన విధానాలు, జీవం లేని విద్య ప్రమాణాలు తో నైపుణ్యం లేని సమాజాన్ని తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మెరుగైన జీతాలు లేక ప్రభుత్వ ఉపాధ్యాయులు, జీతాలే లేక ప్రైవేటు ఉపాధ్యాయులు కాలం వెలిబుచ్చుతున్నారు. ఈ సంక్షోభం ఇక్కడితో ఆగదు, అజ్ఞాన సమాజం లో వికృత రూపాలు తో సామాజిక సంక్షోభం రాబోతున్నది. ఇప్పుడైనా ప్రభుత్వ సలహాదారులు, విద్యా రంగంలో నిష్ణాతులు, మేధావులు, ఉపాధ్యాయులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు మంచి జీతాలు ఇచ్చి పర్యవేక్షణ ఏర్పాటు చేసి విలువలు తో కూడిన విద్య ప్రమాణాలు ను తీసుకొని రావాలి. విద్యార్థులలో అభ్యాసన సామర్థ్యాలు లేవు అధ్యాపకులకు బోధనా సామర్థ్యాలు అంతకంటే లేవు.
యాభై సంవత్సరాలు ముందు వెలసిన విశ్వవిద్యాలయాల్లో అకడమిక్ స్టాఫ్ కాలేజీ లు మూతపడి దశాబ్దం అవుతుంది. రిఫ్రెషర్ కోర్సులు, ఓరియెంటేషన్, స్టాఫ్ డెవెలప్మెంట్ కోర్సులు అన్నీ అనీత విద్య లాగా టీవీలు, కంప్యూటర్లలో బోధిస్తున్నారు. . విద్యాలయాలంటే బిల్డింగులు స్థలాలు కాదు, అధ్యాపకులు లేకుండా విశ్వవిద్యాలయాలు ఎలా నడుపుతారో బోధ పట్టం లేదు. పరీక్షలు సకాలంలో జరపరు, ఫలితాలు వెల్లడించరు, పిహెచ్డి వైవా జరపరు. పరిస్థితి ఇలా ఉంటే మరో రెండు సంవత్సరాలలో విశ్వవిద్యాలయాలను శాశ్వితంగా మూసివేయడం ఖాయమని పిస్తుంది. కాషాయీకరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణ ప్రధానంగా సమాన విద్యావకాశాలు లేని నూతన విద్యా విధానం ప్రవేశపెట్టారు. నాలెడ్జ్ సొసైటీలలో ఉన్నత విద్యా వ్యవస్థలో విద్యా పరిశోధన అంతర్భాగమని వాస్తవాన్ని సరిగ్గా అంగీకరించింది. ఎప్పటికప్పుడు పరిశోధన తాజా జ్ఞానం యొక్క కొత్త రంగాన్ని అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది, ఇది బోధనకు ప్రయోజనం చేకూరుస్తుంది. విద్య యొక్క ఉద్దేశ్యం “పూర్తి మానవ సామర్థ్యాన్ని సాధించడం, సమానమైన న్యాయమైన సమాజాన్ని అభివృద్ధి చేయడం” అని విద్యా విధానంలో పేర్కొన్నప్పటికీ, గ్రామీణ భారతదేశంలోని అట్టడుగున ఉన్న మెజారిటీ అవసరాలు తీర్చడంలో అది విఫలమైంది, వారు అనేక విధాలుగా పౌరులుగా కాకుండా సబ్జెక్ట్‌లుగా మార్చబడ్డారు.
పరిశోధన ప్రజా జోక్యాల ద్వారా వివిధ సామాజిక-ఆర్థిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనడమే కాకుండా వినూత్న ఆలోచనలు సమాజాలు ఆర్థిక వ్యవస్థలను బహిర్గతం చేస్తుంది. అంతే కాకుండా, పరిశోధన సైన్స్, టెక్నాలజీ ప్రతి ఇతర రంగంలో ఆవిష్కరణలు తెస్తుంది. వాస్తవానికి, పరిశోధన నిధులు సంస్థాగతీకరించడం ద్వారా నూతన విద్యా విధానం యొక్క పది అంచనాలలో ఉన్నత విద్యా వ్యవస్థలో పరిశోధనను ప్రోత్సహించడం ఒకటి, ఇది ఒక క్లిష్టమైన అవసరం. వాస్తవానికి, విద్యా విధానం ప్రత్యేకించి విద్యాసంబంధ పరిశోధనలకు ఆర్థిక సహాయం చేయడంలో నిబద్ధత లేదు. కళ, భాష, సంస్కృతి, సమాజం, ఆర్థిక వ్యవస్థ, సమాజం, పర్యావరణం ఇతర విషయాలలో పరిశోధనలు చేపట్టడానికి తగిన ప్రజా సంస్థాగత నిధులు లేకపోవడంతో ఇది విఫలమైంది. అదే సమయంలో, స్పేస్, సైన్స్ టెక్నాలజీ రంగంలో కొన్ని మినహాయింపులు ఉండవచ్చు, అవి ప్రత్యేక ప్రయోజన సంస్థలు ప్రైవేట్ పారిశ్రామిక సంస్థల నుండి గొప్ప ఆర్థిక సహాయాన్ని ఆకర్షించాయి. జాతీయ విద్యా విధానం 2020 అనేది విద్యా వ్యవస్థలో గణనీయమైన నిర్మాణాత్మక మార్పులను సిఫార్సు చేసే ఒక లేయర్డ్ డాక్యుమెంట్, ఇది విద్య ద్వారా తిరిగి పొందగలిగే గత అద్భుతమైన భారతదేశం యొక్క నిర్మిత కల్పనలలో మునిగిపోతుంది.
ప్రాథమిక విద్య కోసం ఆలోచనలు, మరియు మొత్తంగా పట్టణ మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు మార్గదర్శక నక్షత్రం వలె పనిచేస్తుంది. కానీ ఉద్దేశపూర్వకంగా లేదా కమిటీ సభ్యుల పరిమిత అవగాహనతో, నూతన విద్య విధానం సమకాలీన గ్రామీణ భారతదేశం యొక్క సంక్లిష్టతను విస్మరించింది, ఇది దాని ఆర్థిక వ్యవస్థ యొక్క తీవ్ర క్షీణత, విస్తారమైన బాధల రూపాలు పౌరులలో ఎక్కువ మంది పేదరికం ద్వారా గుర్తించబడింది. ఎన్ఈపి “యాక్సెస్, పార్టిసిపేషన్ లెర్నింగ్ రిజల్ట్స్‌లో బ్రిడ్జ్ గ్యాప్‌లు” అని పేర్కొన్నప్పటికీ, నాణ్యత లేని విద్య గ్రామీణ పౌరుల జీవితాలను దెబ్బతీస్తుందనే వాస్తవాన్ని ఇది విస్మరించింది. నాణ్యమైన విద్యలో సమానత్వం తో కూడిన విద్యావకాశాల సమానత్వాన్ని పెంపొందించే ఆలోచన నిమగ్నమవ్వడాన్ని విస్మరిస్తూ, పెరుగుతున్న పాఠశాల భేదాన్ని పరిష్కరించడంలో విద్య విధానం విఫలమైంది, దీనిలో ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ప్రధానంగా వెనుకబడిన కులాలు, షెడ్యూల్, ఆదివాసీ సమూహాల పిల్లలు చదువుతున్నారు, అయితే ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బలోపేతం చేయకుండా ఏడాదంతా ప్రవేశాలు పెట్టినా లాభం లేదని గ్రహించాలి.
-డా. యం. సురేష్ బాబు,
అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక.




