కల్తీ సారా పేరుతో ప్రభుత్వంపై దుష్పచ్రారం
టిడిపి తీరుపై అసెంబ్లీలో మండిపడ్డ సిఎం జగన్
అమరావతి, మార్చి 14 : సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారంపై ఆయన అసెంబ్లీలో స్పందిస్తూ.. నేచురల్ డెత్స్‌పై టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. కల్తీ మద్యం మరణాలు గతంలోనే అనేక సార్లు జరిగాయి. కల్తీ మద్యాన్ని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోందని.. రాష్ట్రంలో బెల్ట్ షాపులను సమూలంగా నిర్మూలించామని అన్నారు. లాభాపేక్షతో గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపింది. బడి, గుడి సపంలో కూడా యథేచ్ఛగా మద్యం అమ్మారని సీఎం ధ్వజమెత్తారు. సహజ మరణాలు దేశ వ్యాప్తంగా జరుగుతుంటాయి. దేశంలో ఎక్కడైనా 90 శాతం సహజ మరణాలే ఉంటాయి. అన్ని మరణాలు ఒకే చోట జరిగినవి కాదు. సాధారణ మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని సీఎం జగన్ మండిపడ్డారు.
తమ హయాంలో 43 వేల బెల్టు షాపులను ఎత్తివేశాం. మద్యపానం నియంత్రించాలన్నదే తమ లక్ష్యమని సీఎం అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభలో స్పందించారు. సహజ మరణాలపై టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. కల్తీ మద్యం మరణాలు గతంలో కూడా అనేక సార్లు జరిగాయన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరి స్తున్నారని మండిపడ్డారు. కల్తీ మద్యాన్ని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో బెల్ట్‌షాపులను పూర్తిగా ఎత్తేశామని చెప్పారు. లాభాపేక్షతోనే గతప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపిందని ఆరోపించారు. మద్యం అమ్మకాలపై పూర్తి నియంత్రణ విధిస్తున్నామని తెలిపారు. వివిధ వర్గాల సూచనల మేరకు మద్యం ధరలు తగ్గించామని సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా.. జంగారెడ్డి గూడెం ఘటన సభలో పెను దుమారాన్ని రేపింది. వరుస మరణాలపై సభలో చర్చ జరపాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
స్పీకర్ ఛాంబర్ వద్ద నిరసనకు దిగారు. స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టి తమ్మినేనిపై కాగితాలు విసిరారు. ఈ క్రమంలో సభ రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలోనూ టీడీపీ సభ్యులు ఆందోళనను కొనసాగించారు. తెలుగుదేశం నేతల తీరుపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిరసనను విరమించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ ఐదుగురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవులు, రామానాయుడు, వీరాంజనేయస్వామి బ్జడెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెన్షన్‌కు గురయ్యారు. చర్చ అనంతరం ఆంధప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మూడు రోజుల పాటు సెలవుల అనంతరం సోమవారం ప్రారంభమైన సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.