Take a fresh look at your lifestyle.

షెడ్యూల్‌ ‌ప్రకారమే ఎపిలో ఎన్నికలు

  • ఎమ్మెల్యేలతో భేటీలో ఏపి సిఎం జగన్‌ ‌స్పష్టీకరణ
  • టిడిపి, ఎల్లో డియా ప్రచారాలను నమ్మొద్దని హెచ్చరిక

అమరావతి, ఏప్రిల్‌ 3 : ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని..తెలంగాణ రాష్ట్రంతోపాటు నిర్వహించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సిఎం జగన్‌ ‌స్పష్టం చేశారు. షెడ్యూల్‌ ‌ప్రకారమే ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని టీడీపీ గొప్పలకు పోతుందని, ఎమ్మెల్యేలతో భేటీలో ఎమ్మెల్సీ ఫలితాలపై సీఎం జగన్‌ ‌స్పష్టతనిచ్చారు. 21 స్థానాల్లో.. 17 స్థానాలు వైసీపీ గెలిచిందని, ఉన్నది లేనట్టుగా మారీచులు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి ఉంటుందని, 80లక్షల ఓట్లలో కేవలం రెండున్నర లక్షలమంది మాత్రమే పట్టభద్రులు ఉన్నారని ఆయన తెలిపారు. పట్టభద్రుల ఓటర్లలో రకరకాల యూనియన్లు ఉన్నాయని, అందులో 87? మాతోనే ఉన్నారని సీఎం జగన్‌ ‌తేల్చి చెప్పారు. కేవలం 20? మంది మాత్రమే డీబీటీలో ఉన్నారని, వచ్చే ఎన్నికలకు ఇది ఏమాత్రం శాంపిల్‌ ‌కాదంటూ ఎమ్మెల్యేలతో భేటీలో ఎమ్మెల్సీ ఫలితాలపై సీఎం స్పష్టత నిచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఒక్క ఎమ్మెల్యేనూ వదలుకోమని, అందర్నీ గెలిపించుకుటామని అన్నారు. కానీ, ఎమ్మెల్యేలంతా క్రియాశీలకంగా ఉండాలని, సోషల్‌ ‌డియాను బాగా ఉపయోగించుకోవాలని సూచించారు.

గడప గడపకు త్వరగా పూర్తి చేయాలని, నెలకు 25రోజులు సచివాలయాల్లో తిరగాలని, సెప్టెంబరు నుంచి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు.మంత్రి జోగి రమేష్‌ ‌స్పష్టం చేశారు. సీఎం జగన్‌ ‌క్యాంప్‌ ఆఫీసులో ఎమ్మెల్యేలతో భేటీ జరిగింది. ఈ సందర్భంగా జగన్‌ ‌చేసిన వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఉపదేశాన్ని మంత్రి జోగి రమేష్‌ ‌వివరించారు. ఏపీలో ఎన్నికలు షెడ్యూల్‌ ‌ప్రకారం 2024లోనే జరుగుతాయని వివరించారాని తెలిపారు. 60 మంది ఎమ్మెల్యేలను మార్చుతున్నట్లు వార్తలను సైతం జగన్‌ ‌ఖండించారని.. అందరినీ గెలిపించుకునే బాధ్యత పార్టీపై ఉందన్నారాయన. ఒక్క ఎమ్మెల్యేను కూడా వదులుకోం.. అందర్నీ గెలిపించుకుంటాం అని స్పష్టంచేసినట్లు వివరించారు. నాలుగు ఎమ్మెల్సీల ఓటమిపై జగన్‌ ‌స్పందిస్తూ.. వాపును చూసి బలుపు అని టీడీపీ భావిస్తుందని.. తప్పుడు వార్తలతో నిజాన్ని సమాధి చేయాలని చూస్తున్నారంటూ జగన్‌ ‌వ్యాఖ్యానించారు. గడప గడపకు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని.. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్నట్లు వెల్లడించారాయన. 2024 ఎన్నికల్లో గెలిచే బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉందని.. గెలిచి తీరాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు జగన్‌. ‌

ప్రతి ఎమ్మెల్యే సోషల్‌ ‌డియాను బాగా ఉపయోగించుకోవాలని.. ఇంటింటికీ వెళ్లటంతోపాటు నిరంతరం సోషల్‌ ‌డియా ద్వారా ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని హితబోధ చేశారు జగన్‌. ఎమ్మెల్యేల గ్రాఫ్‌ ‌సరిగాలేకపోతే వ్యక్తిగతంగా తోపాటు.. పార్టీకి సైతం నష్టం అని.. ప్రతి ఎమ్మెల్యే కష్టపడి పని చేయాలని.. ఉన్న ఏడాది కాలాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని సీఎం జగన్‌ ‌సూచించారు.ప్రజలకు మంచి చేస్తున్నా.. ఎల్లో డియా తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తుందని సీఎం జగన్‌ ‌ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ఇలాంటి రూమర్స్ ఇం‌కా ఎక్కువ జరుగుతాయని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు వాటికి భంగ పడకుండా ఉండాలని సూచించారు. కొందరు.. ఎమ్మెల్యేలను టార్గెట్‌ ‌చేసి వాళ్లపై విష ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో జరిగిందని ప్రజలను మభ్య పెడుతున్నారు. 21 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే 17 తమ పార్టీ గెలిచిందని జగన్‌ ‌గుర్తుచేశారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోనని, అందరితో పనిచేయించి గెలిపించుకునేందుకే ప్రయత్నాలు చేస్తానని, ఎవరు చేయాల్సిన పని వాళ్లు చేస్తే 175 సీట్లు గెలుస్తామంటూ ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ ‌భరోసా అందించారు.

Leave a Reply