Take a fresh look at your lifestyle.

శివరంజని రాగమా..

స్వేచ్చా కపోతమా
స్వచ్ఛమైన శ్వేత సౌధమా

ఎగిరొచ్చి నా హృదిలో వాలిన నేస్తమా
వసంత ఆగమ నాన నా తోటలో విరిసిన పుష్పమా

ఆశల పల్లకిలో అందమైన అబద్దమా
ఆకాశమంత నా మదిలో అంతులేని ఆనందమా

లిప్ల కాలంలో మాయమైన ప్రియతమా
కనుల కొలనులలో నిశ్శబ్ద కన్నీటి ప్రవాహమా

నా స్వప్నలోకాన్నుంచి నిష్క్రమించి
నన్నే కాకిని చేసి వచ్చిన దారినే తిరిగివెళ్ళిన
పావురమా
కాళ రాత్రిలో నా శివరంజని రాగమా!
– కోటా దేవదానం, న్యాయవాది (రిటైర్‌ అడిషనల్‌      
                 ‌పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌,  ‌భద్రాచలం

Leave a Reply