Take a fresh look at your lifestyle.

వైసిపిలో పెరుగుతున్న అసహనం

అమరావతి,ఏప్రిల్‌1: ‌పుట్టపర్తిలో టీడీపీ నేతలపై వైసీపీ దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  తీవ్రంగా ఖండించారు. వైసీపీ లో ఓటమి భయంతో ఫ్రస్టేషన్‌ ‌కనిపిస్తోందన్నారు. ట్విట్టర్‌ ‌వేదికగా స్పందిస్తూ…‘పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి వాహనంపై, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్టేష్రన్‌ ‌కనిపిస్తుంది అంటూ చంద్రబాబు ట్వీట్‌ ‌చేశారు.కాగా.. పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్లలె రఘునాథ్‌రెడ్డి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో పుట్టపర్తిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌  ‌పాదయాత్ర సందర్భంగా పుట్టపర్తిలో అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే సత్తెమ్మ దేవాలయంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నానంటూ సవాల్‌ ‌విసిరారు. శ్రీధర్‌రెడ్డి సవాల్‌ను మాజీ మంత్రి ప్లలెరఘునాథ్‌ ‌రెడ్డి స్వీకరించారు. శ్రీధర్‌రెడ్డి చేసిన అవినీతిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రతిసవాల్‌ ‌చేశారు. సత్తెమ్మ దేవాలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్లలె చెప్పారు. ఈ క్రమంలో శ్రీధర్‌ ‌రెడ్డి, ప్లలె రఘునాథ్‌ ‌రెడ్డి ఈరోజు సత్తెమ్మ దేవాలయానికి వస్తున్నారన్న నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ప్లలె రఘునాథ్‌ ‌రెడ్డి గృహ నిర్బంధం చేశారు. ఇంటి నుంచి బయటకు రావద్దని స్పష్టం చేశారు. ప్లలె ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేను మాత్రం సత్తెమ్మ దేవాలయానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు.

ఓవైపు పుట్టపర్తిలో 30యాక్ట్ అమలులో ఉందని.. రాజకీయ కార్యక్రమాలు చేయడానికి వీల్లేదంటూ పోలీసుల చెబుతూనే పుట్టపర్తి ఎమ్మెల్యేకు మాత్రం దేవాలయానికి అనుమతించారు. ఈ సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. 30 యాక్ట్ ‌పేరుతో తమ నాయకుడు ప్లలె రఘునాథ్‌రెడ్డిని గృహనిర్బంధం చేసిన పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేకు అనుమతి ఎలా ఇచ్చారని మండిపడుతున్నారు. టీడీపీ, వైసీపీ శ్రేణులు సత్తెమ్మ దేవాలయానికి చేరుకుంటున్న సమయంలో ఇరువర్గాలు చెప్పులు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనపై టిడిపి నేతలు తీవ్రంగా స్పందించారు. వైసిప గూండాయిజానికి పరాకాష్ట అన్నారు.

Leave a Reply