రాహుల్‌కు జ్ఞాపక శక్తి తగ్గి మతిమరుపు పెరిగింది
రామప్ప అభివృద్ధి చేసింది మేమే
రాహుల్, ప్రియాంకలు మోదీకి థ్యాంక్స్ చెప్పాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రామప్ప అభివృద్ధి చేసింది మోదీనేని బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాహుల్, ప్రియాంక గాంధీల పర్యటనలో రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్న సందర్భంగా పీఎం మోదీకి ధన్యవాదాలు తెలపాలని, రామప్ప దేవాలయాన్ని పీఎం అభివృద్ధి చేశారని కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్, ప్రియాంకలు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడారని మండిపడ్డారు. రాహుల్‌కు జ్ఞాపక శక్తి తగ్గినట్లు ఉందని, మతిమరుపు పెరిగిందని అన్నారు. వారు వాస్తవాలు మర్చి పోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ను తాను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నానని, రాహుల్‌కు దమ్ము దైర్యం ఉంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. 2004లో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టు కాలేదా…అధికారం పంచుకోలేదా అని, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉంటే కేసీఆర్ కేంద్ర మంత్రిగా లేరా అని, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌లో టీఆర్‌ఎస్ వాళ్ళు మంత్రులు కాలేదా అని, 2014లో కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మేల్యేలు..ఏ పార్టీలోకి వెళ్లి చేరారని, ఎవరికి వోటు వేస్తే ఎవరికి లాభం జరిగిందని, కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మేల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరి కేసీఆర్‌కు మడుగులు వొత్త లేదా…అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ జాబితా సిద్దం కాగానే చెప్తామని అన్నారు. రాజాసింగ్ వ్యవహారం తమ అంతర్గతమన్నారు. సస్పెన్స్ ఎత్తివేస్తే రాజాసింగ్ పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమవుతామని తెలిపారు. అభ్యర్థుల కసరత్తు ప్రారంభం చేశామన్నారు. ఎవరికి ఎవరు బిటిమ్..కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ బిటీమ్ అన్నారు. 2013 లో టీఆర్‌ఎస్ ను కాంగ్రెస్ లో మెర్జ్ చేసేందుకు చర్చలు జరగలేదా అంటూ ప్రశ్నించారు. ఎవరికి ఎవరు బిటిమో రాహుల్ చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ పై వోటుకు నోటు కేసు ఏమయిందని, ఎందుకు తొక్కి పెట్టారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు మధ్యవర్తిగా మజ్లిస్‌ను పెట్టుకున్నారని మండిపడ్డారు. మూడు పార్టీలు కలిసి అట ఆడుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు పార్టీల డిఎన్‌ఎ ఒక్కటే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి అవగాహనతో మూడు పార్టీలు పని చేస్తున్నాయని సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాహుల్ చర్చలు సిద్దమా..అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దిల్లీ ఐనా, హైదరాబాద్ అయినా రాహుల్‌తో తాను చర్చకు సిద్దమని అన్నారు




