‌రైతు రాజకీయాలు ….రైతన్నల పాలిట శాపాలు

ఏ ఊరిలో అయినా సొంతగా భూమి తన పేరు మీద ఏ పావు ఎకరం ఉన్న దర్జాగా కాలర్‌ఎగిరేసుకుని తిరిగే దమ్ము దైర్యం ఉన్న తెలంగాణా  రైతు పరిస్థితి..  తాజా రాజకీయ పరిణామాలతో రైతులు సైతం రాజకీయాల నలుసు అంటించుకొని ఆరోగ్యకరమైన, ఆహ్లదకరమైన వ్యవసాయానికి  తిలోదకాలిచ్చి రాజకీయ పార్టీలతో జత అయ్యి వ్యవసాయ  తరం లేకుండా రేపటి తరానికి రైతు అంటే అన్న దాత  కాకుండా రైతంటే రాజకీయ అనాధ అన్న స్థితికి  చేర్చారు. తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం ఎవరు,పంట పండితే పండుగ నుంచి దండగ ఎలా అయ్యింది…? ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ఇద్దరు రైతు పైన రాజకీయ పబ్బం గడుపుకుంటే ఆధునిక వ్యవసాయ పద్ధతులతో  అన్న దాతను ఆదుకోవాల్సింది పోయి రచ్చకీడ్చి రాజకీయం చేస్తుంది ఎవరు..?ఉద్యమకారుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ ‌రావు ప్రెస్‌మీట్‌లతో పన్చులేస్తుంటే.. సహచర మంత్రులు, ఎమ్మల్లెలుతెలంగాణ వ్యతిరేకులను ఉరికిచ్చి కొట్టండి అని ప్రగల్బాలు పలుకుతున్నారు. తెలంగాణ రైతు పండించిన పంటను కేంద్రం కొనేంత వరకు వదిలేది లేదు అని గ్రామా  గ్రామాన ధర్నాలకు ఆందోళనకు పిలుపునిచ్చారు.ఈ విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని అవసరమైతే హస్తినలో ఆందోళన చేపడతామని ఆయన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించారు.

తెలంగాణలో తన మార్క్ ‌చూపెట్టాలని మరో వైపు అమిత్‌ ‌షా అనుచరులును కత్తి దుస్తున్నారు.  పండించిన వరిని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వరి కొనుగోలు చేయడములో విఫలమయ్యింది అని డిమాండ్‌ ‌చేస్తూ ఒకరోజు ముందే జిల్లా కేంద్రాలలో  కలెక్టరేట్‌ ‌కార్యాలయాల వద్ద ధర్నాకు దిగింది. కేంద్రం కొనేందుకు సిద్ధమైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్నిఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా రైతు పక్షాన పోరాడుతామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు దండు  బనాయిన్చాడు. ఈ సందిగ్ధం లో రైతు పక్షనా రైతు సంక్షేమం కోసం పోరాడుతుంది ఎవరో తెలియని దుస్థితోలో రైతులు రాజకీయంగా చీలిపోయి రైతు ఐక్య మత్యాన్ని కోల్పోయి ప్రశ్నించే  గొంతు లేక రైతులు రాజకీయంగా  చీలి పోయారు.
వరి సాగులో తెలంగాణ ఇప్పుడు దేశంలోనే మేటి రాష్ట్రం అయింది.గత పది సంవత్సర ల కాలం తో పోలిస్తే  ఈ  మధ్య తెలంగాన రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పూర్తయి నీటి పారుదల విస్తరించింది. దానికి ఉచిత విద్యుత్‌ ‌సరఫరా ,రైతు బీమా  మరియు వరిపంటకు కనీస మద్దతు ధర నిర్ణయయించడం తో  రైతులు వరి పంట వైపు మొగ్గు చూపారు. కెసిఆర్‌ .  ‘‌కోటి ఎకరాల మాగాణి’ స్లోగన్‌ ‌నెరవేర్చే క్రమంలో తెలంగాణ ఇరిగేషన్‌ అధ్యాయం వడి వడిగ అడుగు లేస్తోంది.

ఈ క్రమంలో పండించిన ధాన్యం సేకరణ రాష్ట్రం చేపడుతుంది. రాష్ట్ర అవసరాలకు మిగతాది కేంద్రానికి సబ్సిడీ కింద అందిస్తుంది. అయితే ముందు చూపు లేని ప్రభుత్వాలు సరుకు నిల్వ సామర్థ్యం లేక పండించిన పంటను కొనలేని ప్రతికూల పరిస్థితి ,వాతావరణ అనుకూలత లభించడాము  తో ఇబ్బడి ముబ్బడి గ పండించిన పంటను ఆ కేంద్రం  కొనుగోలు చేయడం సాధ్యంకాదని చేతులెత్తయడం  తో రచ్చ  మొదలైంది. కేంద్ర రాష్ట్ర పార్టీలు వరి కొనుగోలు పై  కయ్యానికి కాలు దువ్వడం తో  తెలంగాణ రాజకీయాలు హీటెక్కినై, ఈ సందర్భంగా భారత ఆహార సంస్థ ఛైర్మన్‌ ‌డీవీ ప్రసాద్‌ ‌వరిపంటలో తెలంగాణ నెంబర్‌ ‌వన్‌ అయి, భారత దేశానికంతా ‘అన్నపాత్ర’గా ఎదిగిందని ఓ సమావేశం లో కొనియాడారు, దేశవ్యాప్తంగా ఈ రబీ సీజన్లో ఎఫ్సీఐ 83.01 లక్షల టన్నులు కొనుగోలు చేసిందని, అందులో ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే 52.23 లక్షల టన్నులు సేకరించామని ఆయన ట్వీట్‌ ‌చేసాడు.. 2020 రబీ సీజన్లో దేశంలోని మొత్తం వరి సేకరణలో తెలంగాణ రాష్ట్రం 63 శాతం వాటాను కలిగి ఉండగా, ఇతర రాష్ట్రాలు 37 శాతం వాటాను కలిగి ఉన్నాయి అని ఆయాన పేర్కొన్నారు.

వరి సాగులో ఊపందుకొని పండుగ చేసుకున్న తెలంగాణ రాష్ట్రం.. ‘ఇక వరి పంట వేస్తేఉరే అని హెచ్చరిక తెలంగాణ రైతాంగాన్నిఅయోమయంలోకి నెట్టేసింది. యాసంగిలో వారి వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తూ  ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాలని చెబుతూ ఉంది. రైతులకు వరి విత్తనం అమ్మకుండా చర్యలు తీసుకుంటూ ఉంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా   కఠినంగా వ్యవహరిస్తామని  కలెక్టర్లు  బహిరంగంగా హెచ్చరించి వివాదం సృష్టించారు.అయితే  ఇది అప్రజాస్వామికమని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. మరోవైపు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన లేని రైతులు  వారి పొలంలో వరి తప్ప మరొకటి పండదు, వేరే పంటలు  ఉన్నట్లుండి పండిచమంటే  ఎలా?అని తెలంగాణ  రైతులు ప్రశ్నిస్తున్నారు.

వరి సేకరణలో  ధాన్యం నిల్వలు పెరిగిపోయాయి నిల్వ సామర్త్యలు లేక పండించిన పంటను కేంద్రం కొనలేము అని చేతులెత్తేసింది అయితే గ్లోబల్‌ ‌హంగర్‌ ఇం‌డెక్స్ 2020‌లో 107 దేశాలలో భారతదేశం 94వ స్థానంలో ఉంది.  సమర్థవంతమైన పర్యవేక్షణ లేకపోవడం, పోషకాహార లోపాన్ని పరిష్కరించడంలో మౌనం వెలగ పెడుతున్నారు అని  నిపుణులు పేర్కొనడంతో  భారత దేశం  ‘తీవ్రమైన’ ఆకలి కేటగిరీలో ఉంది. గతేడాది 117 దేశాల్లో భారత్‌ ‌ర్యాంక్‌ 102‌వ స్థానంలో ఉంది.దారిద్యం ఓ వైపు తాండవిస్తుంటే గోడౌ న్లల్లో నిల్వలు పెట్టుకోవడమేంటీ అని  బియ్యాన్ని దేశంలో దారిద్య్రంలో ఉన్న 20 కోట్ల మందికి పంచండి, ఖాలీఅవుతాయని ప్రఖ్యాత జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్‌ ‌సూచించారు.

గత కొన్ని సవత్సరాలుగా వరి సాగు విస్తీరణం విపరీతంగా పెరిగింది. గడిచిన ఏడాదిరబీలో వరిసాగు విస్తీరణం 237.85 శాతం పెరిగిందని వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. గత రబీలో 22,19,326 ఎకరాల నుడి  52,78,636 ఎకరాలకు వరి సాగుపెరిగింది.కాళేశ్వరం ప్రాజెక్టు.. దానిఉప నదుల ద్వారా గ్రామ గ్రామాన నీరు చేరడం తో  తెలంగాణ వ్యవసాయం వరి వైపు వెళ్తున్నదనీ  తద్వారా వరి విస్తీర్ణం పెరుగుదల మంచిది కాదని చెబుతున్న  వ్యవసాయ నిపుణులు  రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన పెంచాలి,మంచి పంటల కార్యాచరణ చేయాలి..  రైతులను ఆట వస్తువులుగా చేయొద్దు. కేంద్రం తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడిక్కడ నిల్వ సామర్త్యలు పెంచి కొనుగోలు కేంద్రాలు విస్తరించి ప్రపంచానికే ఆదర్శంగా  నిలవొచ్చు  అని ప్రముఖ  వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు .ఈ వరి కొనుగోలు సమస్య మన ఒక్క రాష్ట్రానిదే కాదు దేశం మొత్తం వరి పండించే రాష్ట్రాల పరిస్థితి ఇదే.. అయితే ఆయా రాష్ట్రాల్లో  ఒక్క పంజాబ్‌ ‌తరవాత వరి ఎక్కవగా పండించే రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాలే.. అయితే మిగితా రాష్ట్రాల్లో పండించే పండ్లు,గోధుమలు,జొన్నలు,మన రాష్ట్రాల్లో తక్కువే అయితే ఇప్పటికిప్పుడు పంట మార్పుకు తెలంగాణ  రైతాంగం సుముఖంగా లేదు ,అయితే ఇందులో సమస్యను  పక్కదారి పట్టించి  రైతులకు మేలు చేసే విజ్ఞత కన్న రాజకీయమే ఎక్కువగా ఉంది అని  ప్రముకులుకొందరు హెచ్చరిస్తున్నారు.

భారతదేశంలోని 726 మిలియన్ల గ్రామీణ జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. భారతదేశం మొత్తం జనాభాలో దాదాపు 65% మందికి బియ్యం ప్రధాన ఆహారం. 1950-52లో 32.3 మిలియన్‌ ‌టన్నుల (20 మిలియన్‌ ‌టన్నుల క్లీన్‌ ‌రైస్‌) ‌నుండి  2002లో రఫ్‌ ‌రైస్‌ ఉత్పత్తి 135 మిలియన్‌ ‌టన్నులకు (89 మిలియన్‌ ‌టన్నుల స్వచ్ఛమైన బియ్యం) చేరుకుంది. ప్రధానంగా వ్యవసాయం డైనమిక్‌ ‌మార్గంలో ఉంది. సంప్రదాయ ఉత్పత్తి విధానాన్ని ఆధునిక వ్యవసాయంగా మార్చడం. వరి ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్యమైనది మరియు ప్రపంచ మానవ తలసరి శక్తిలో 21% మరియు తలసరి ప్రోటీన్లో 15% అందిస్తుంది.

కల్తీలు పెరిగిపోవడం ,ప్రజల ఆహారపు అలవాట్లు మారడం, వరి డిమాండ్‌ ‌పడిపోవడం,చిరు ధాన్యాల వాడకం పెరగడం  వైట్‌  ‌రైస్‌ ‌లో కార్బోహైడ్రేట్స్ ‌శాతం ఎక్కువగా ఉండటం పర్యావరణం మీద వరి సాగు ప్రభావం.. తదితర కారణాల రీత్యా రైతులు మారరు.ఇతర పంటల వైపు మళ్లాలి. దీనికి కొంతకాలం పడుతుంది. అంతవరకు ప్రభుత్వం రైతులకు  సాయం అందిస్తూ  ఆధునిక వ్యవసాయ పద్ద్దతులు,  మెలకువలు  మరియు విధి  విధానాలు నేర్పుతూఉండాల్సిందే’’అని నిపుణుల అభిప్రాయం. అయితే చాలామంది ఆర్థిక నిపుణులు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణిని విమర్శిస్తున్నారు. ఈ సమస్యను రాజకీయ కోణం లో కాకుండా రైతు సామాజిక కోణం లో చూసి ఉంటే  ఈ సమస్య తలెత్తేది కాదు అని ఓ ప్రముఖ ఆర్థిక నిపుణుడు నొక్కివక్కాణించారు.అయితే, సమస్యకు అసలు కారణం కేంద్రం తెలంగాణ మీద చూపిస్తున్న వివక్షయే కారణమని తెలంగాణ ప్రభుత్వం విమర్శిస్తూ ఉంది. పంజాబ్‌ ‌మాదిరిగా తెలంగాణ లో పండుతున్న ఇతర పంటలు పప్పుదినుసులు మరియు పళ్ళను   కేంద్రం ఎందుకు కొనడం లేదో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ ‌చేస్తుంది.ప్రొఫెసర్‌  ‌జయశంకర్‌ ‌విశ్వ వ్యవసాయ విశ్వ విద్యాలయ శాస్త్ర వేత్తల సూచన ప్రకారం తెలంగాణలో వరి తో పాటు ఇతర పంటలకు కూడా తెలంగాణ నేల అనుకూలమని సూచిస్తున్నారు.

ఎంపిక చేసిన పంట సముదాయంలో తెలంగాణకు 13 పంటలు ఉన్నాయిబీ వరి, జొన్న, మొక్కజొన్న, పచ్చిమిర్చి, నల్లరేగడి, ఎర్ర శనగ, బెంగాల్‌ ‌పప్పు, వేరుశనగ, పత్తి, పొద్దుతిరుగుడు, కుసుమ, నువ్వులు మరియు సోయాబీన్‌ ‌మరియు ఆంధ్రప్రదేశ్కు 15 పంటలుబీ వరి, జొన్న, మొక్కజొన్న, పచ్చిమిర్చి, నల్లరేగడి, ఎర్ర శనగ, బెంగాల్‌ ‌శనగ, వేరుశనగ, పత్తి, పొద్దుతిరుగుడు, నువ్వులు, నైజర్‌, ‌చెరకు, కొబ్బరి మరియు ఉల్లి.రైతులు రాజకీయ రొంపి లో దిగకుండా ఐక్యమత్యంగా ఆధునిక వ్యవసాయ పద్దతులు, వ్యాపార అనువైన పంటలు, మార్కెట్‌ ‌డిమాండ్‌ ఉం‌డే వంగడాలు.. నిత్యా అవసరాలు తీర్చే పళ్ళు కూరగాయలు పండించి ఆర్గానిక్‌  ‌వ్యవసాయ విధానాన్ని ఒంట పట్టించుకోని ముందుకు సాగితే రైతే రాజు దేశానికి వెన్నెముక అని అనక తప్పదు.
 – డా. కృష్ణా సామల్ల
ప్రొఫెసర్‌ ,9705890045

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page