రైతులకు లాభం జరిగేలా బ్యాంకులు సహకరించాలి..:మంత్రి హరీష్ రావు   

 

రైతు రుణ మాఫీ డబ్బులు వెళ్లాల్సింది బ్యాంకు అకౌంటల్లోకి కాదు, రైతుల చేతుల్లోకి అని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.బేగంపేటలోని హోటల్ వివంతలో నేడు  నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ..రెండు సార్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రానిదే..రైతు సంక్షేమం, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి సీఎం కేసీఆర్  రైతులకు రాష్ట్రంలో రుణమాఫీ చేస్తున్నారు..రుణమాఫీ ప్రక్రియ వేగంగా జరిగేలా, రైతులకు లాభం జరిగేలా బ్యాంకులు సహకరించాలి. అని సూచించారు. సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్.బి.ఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు, లీడ్ బ్యాంకుల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *