- పిడిఎస్ కింద జొన్నలు, రాగుల సరఫరా
- కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కారుమూరి భేటీ
న్యూదిల్లీ,మార్చి2 : వచ్చే రెండు నెలల్లో జొన్నలు, రాగులు కూడా పీడీఎస్ కింద ప్రజలకు సరఫరా చేస్తామని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పీడీఎస్ బియ్యం రీ సైక్లింగ్ జరగకుండా దాడులు చేస్తున్నామన్నారు. రేషన్ కార్డులను తొలగించమని స్పష్టం చేశారు. పార్టీలు, కులాలు చూడకుండా పథకాలు ఇస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. ది•ల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గురువారం భేటీ అయ్యారు. అనంతరం ఏపీ మంత్రి డియాతో మాట్లాడుతూ.. ఏపీలో పీడీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థను కేంద్రం ప్రశంసించిందని తెలిపారు. జియో టాగ్ సిస్టం ద్వారా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేశామన్నారు. స్మార్ట్ పీడీఎస్ విధానం అమలు చేస్తున్నామని… రైస్ మిల్లులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బియ్యం రీ సైకిల్ కాకుండా చేస్తున్నామన్నారు.
ధాన్యం కొనుగోలు డబ్బులు మూడు రోజులలో రైతుల ఖాతాలలో వేస్తున్నట్లు చెప్పారు. 1702 కోట్ల రూపాయల పాత బకాయిలు చెల్లింపునకు కేంద్రం అంగీకారం తెలిపిందని మంత్రి వెల్లడించారు. కేరళ కోసం జయ బొండం బాయిల్డ్ రైస్‌కు కేంద్రం 5 లక్షల మెట్రిక్ టన్నులు ఆర్డర్ ఇచ్చిందని… ఒక లక్ష అంత్యోదయ కార్డుల మంజూరుకు కేంద్రం ఒప్పుకుందని తెలిపారు. రైతుల కు ధాన్యం డబ్బులు ఎప్పటికప్పడు ఇస్తున్నామని… కేంద్రం సకాలంలో చెల్లింపులు చేస్తోందన్నారు. రేషన్ కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో రెండు రోజులుగా కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉన్నత స్థాయి సమావేశం సందర్భంగా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో అదనపు కార్యదర్శి,ఆర్ధిక సలహాదారు శాంతమను , అసిస్టెంట్ సెక్రటరీ శుభోద్ కుమార్ సింగ్, డిప్యూటీ సెక్రటరీ జై నారాయణ్ ,ఐఎఫ్ డి డైరెక్టర్ కెఎం ఖల్సా , యుఎస్ ఐఎఫ్ డి సుబోధి , అండర్ సెక్రటరీ జయప్రకాష్ తదితరులు భేటీ అయ్యారు. ఇకపోతే ఢిల్లీలో కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్టాల్ర కేంద్ర పాలిత ప్రాంతాల పౌరసరఫరాల శాఖ మంత్రులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిజగన్ మోహన్ రెడ్డిఅదేశాలు మేరకు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను శాలువాతో సత్కరించారు… అనంతరం రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అంశాలపై వినతిపత్రం సమర్పించారు.