ముందుగా…తెలంగాణకు ఎందుకు వొస్తున్నారో చెప్పండి

వొస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాల్సిందే

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాల్సిందే

కృష్ణా జలాల్లో వాటా గురించి మాట్లాడిల్సిందే

జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు గురించి చెప్పాల్సిందే

ఇంతకాలం ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్పాల్సిందే

తెలంగాణ అభివృద్దిపై శ్వేతప్రతం విడుదల చేయాలి

వి•డియా సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

అమిత్‌షా ఇవ్వాల్సిన హావి•లపై జాబితా ప్రకటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : హైదరాబాద్‌కు వొస్తున్న అమిత్‌షా..తుక్కుగూడ సభలో ప్రజలకు హావి• ఇవ్వాలని…వాటిని ముందు ప్రకటించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్‌ ‌చేశారు. ఫలానా ఫలానా హావి•లు ప్రకటించాలని ఆమె జాబితా ప్రకటించారు. కాళేశ్వరానికి జాతీయ మోదా మొదలుకుని ఏడేళ్లలో తెలంగాణకు ఏం చేశారో..ఏం ఇచ్చారో ముందుగా శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రాన్ని ఆమె డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్ర విభజన హావి•లను నెరవేర్చాలన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సభ శనివారం జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా రానున్నారు. ఈ సందర్భంగా అమిత్‌ ‌షా తెలంగాణకు ఎందుకు వొస్తున్నారో సమాధానం చెప్పాలని మంత్రి సబిత డిమాండ్‌ ‌చేశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదని, కనీసం పాలమూరు రంగారెడ్డికైనా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. గతంలో సుష్మాస్వరాజ్‌ ‌హావి• ఇచ్చినట్లుగానే జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రజల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నారంటూ ప్రశ్నించారు.

ఈ సభలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తామని అమిత్‌ ‌షా ప్రకటించాలన్నారు. విద్యారంగంలో సీఎం కేసీఆర్‌ అనేక సంస్కరణలు చేపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న గురుకులాల ఏర్పాటుతో ఇవాళ దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. అన్ని రాష్టాల్రకు నూతన విద్యాసంస్థలు ఇస్తుంటే తెలంగాణకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఈ ఏడేళ్లలో ఒక్క విద్యా సంస్థ అయినా ఇచ్చారా..? అని అన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీ, మెడికల్‌ ‌కాలేజీలు, నవోదయ పాఠశాలలు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదన్నారు. వీటన్నింటిపైనా రేపటి సభలో అమిత్‌ ‌షా సమాధానం చెప్పాలన్నారు. ఇవన్నీ తెలంగాణకు ఇవ్వలేదని చెప్పడానికే వొస్తున్నారా..? అని కూడా మంత్రి ప్రశ్నించారు. కేవలం చుట్టపు చూపుగా వొస్తే కుదరదని, అన్ని ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. ఏడాదికి 16 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో అమిత్‌ ‌షా చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఇవాళ దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తూ.. ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారని ఆరోపించారు. ఐటీఆర్‌ ఇస్తామని అనౌన్స్ ‌చేయాలన్నారు. రాష్ట్రానికి రావాల్సినవి ఒక్కటి కూడా ఇవ్వకపోవడంపై తెలంగాణపై చూపిస్తున్న వివక్ష ఏంటో స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ ‌నాయకత్వమే శ్రీరామ రక్ష అన్నారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో ఏలా తప్పించుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. నిత్యవసరాల ధరల పెరుగుదలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గతంలో రూ.400 ఉన్న వంట గ్యాస్‌ ఇవాళ వెయ్యి రూపాయలు దాటిందన్నారు. డీజిల్‌, ‌పెట్రోల్‌ ‌ధరలు ఎందుకు పెరుగుతున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. విభజన హవి•లను నెరవేర్చాలని డిమాండ్‌ ‌చేశారు. కృష్టా బేసిన్‌లో తెలంగాణ వాటా కూడా తేల్చాలన్నారు. ఇక రాజకీయ లబ్ది కోసం బీజేపీ నాయకులు విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు. దేశమంతా ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామనే విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. ఇష్టం వొచ్చినట్లు మాట్లాడి, విద్వేషాలు రెచ్చగొట్టొద్దన్నారు. పాదయాత్ర పేరిట ప్రజలను మోసం చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పైనా మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. తన నియోజకవర్గానికి ఏం చేశానని తనను ప్రశ్నించే కంటే ముందు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చాడో శ్వేతపత్రం విడుదల చేయాలని సబిత డిమాండ్‌ ‌చేశారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీలో సబితా ఇంద్రారెడ్డి వి•డియాతో మాట్లాడారు. శ్మశాన వాటిక, డంపింగ్‌ ‌యార్డుల్లో తమ వాటా ఉందని ఆయన అంటున్నాడు. మరి దేశమంతా ఇవి ఎందుకు లేవు. బీజేపీ పాలిత రాష్టాల్రతో పాటు దేశమంతా పల్లె ప్రగతి ఎందుకు అమలు చేయడం లేదు.

విజన్‌ ఉన్న నాయకత్వం ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు సాధ్యమవుతాయని అన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. స్వచ్ఛ గ్రామాలుగా మనవే టాప్‌లో ఉన్నాయి. ఇదే తుక్కుగూడలోనే వి•రు రేపు వి•టింగ్‌ ‌పెడుతున్నారు కదా.. అదే తుక్కుగూడలో వి• సభా ప్రాంగణం నుంచి రైట్‌ ‌సైడ్‌ ‌చూస్తే డబుల్‌ ‌బెడ్రూం ఇండ్లు, లెప్ట్ ‌సైడ్‌ ‌చూస్తే14 సెకన్లకు ఓ టీవీ తయారయ్యే కంపెనీ కనిపిస్తది. తుక్కుగూడలో 57 కంపెనీలు ఉన్నాయి. రూ. 3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. 18 వేల మంది పిల్లలు పని చేస్తున్నారు. ఇవన్నీ తిరిగి చూస్తే తెలుస్తదని సంజయ్‌కు సబితా సూచించారు. నా నియోజకవర్గ ప్రజలకు నేనేం చేశాను.. ఏం చేస్తున్నాను.. ఏం చేయబోతున్నానను అనే విషయం నేను చెప్పుకుంటాను. ముందు వి•రు ఈ రాష్ట్రానికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రజలకు ఏం అవసరం ఉంది.. రాష్ట్రాభివృద్ధికి ఏం కావాలనే అంశాలపై ఆలోచించాలన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ నాయకుల ఎజెండా అని సబిత విమర్శించారు. ప్రజలపై భరించలేనంత భారం మోపుతున్నప్పుడు పాదయాత్రలు ఎవరి మెప్పు కోసం చేస్తున్నారంటూ సబితా ఇంద్రారెడ్డి బీజేపీని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page