మళ్లీ పెరిగిన గ్యాస్‌ ‌ధర హైదరాబాద్‌లో 1056కు చేరిన సిలిండర్‌ ‌ధర

హైదరాబాద్‌, ‌మే 19 : పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. సామాన్యుడిపై గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర పెరుగుదల రూపంలో మరో భారం పడింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌ ‌ధరను రూ.3.50 పెంచారు. దీంతో  హైదరాబాద్‌లో 1056కు పెరిగింది.  అలాగే వాణిజ్య సిలిండర్‌ ‌ధరను రూ.8 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల భారాన్ని మోస్తున్న సామన్యులపై తాజా పెరుగుదలతో మరింత భారం పడనుంది.

ఈ నెలలో గ్యాస్‌ ‌ధరలు పెరగడం ఇది రెండోసారి. మే 7న సిలిండర్‌పై రూ.50 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకన్నాయి. అంతకుముందు మార్చి 22న కూడా 50 రూపాయలు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 7న సిలిండర్‌పై రూ.50 పెంచిన విషయం తెలిసిందే. ఇక 19 కిలోల కమర్షియల్‌ ‌గ్యాస్‌ ‌సిలిండర్‌పై రూ.8 పెంచడంతో రూ.2364కు చేరింది. 19 రోజుల వ్యవధిలో వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ ‌ధర పెరగడం ఇది రెండోసారి. ఈ నెల 1న సిలిండర్‌పై రూ.102.50 భారం మోపిన విషయం విధితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *