Take a fresh look at your lifestyle.

‌ప్రశ్నిస్తే మొనగాని సంఘానికి అసహనం ఎందుకు?

‘‘ఉపాధ్యాయులకు ఇన్ని సంఘాలు ఎందుకని,రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును చులుకన చేస్తున్నారు.అలసత్వాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే అసహనంతో రగిలిపోతున్నారు.వోటు వేసేవారు ప్రశ్నిస్తే, సమాధానాలు చెప్పాలే గాని అసహనంతో  ఊగిపోతారా?సమాధానాలు చెప్పలేని స్థితిలో అసహనం ఎలా వ్యక్తం అవుతుందో ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.’’

అసహనం ఈ మధ్య దశాబ్ద కాలంగా మన దేశంలో బాగా వినిపిస్తున్న పదం. అసహనం కేవలం ఒక రాజకీయ పార్టీలోనో,ఒక మతంలోనో, ఒక వర్గంలోనో, ఒక కులం లోనో కాకుండా ఆధిపత్య భావా జాలం ఎక్కడ ఉన్న దానిని ప్రశ్నిస్తే వ్యక్తం అవుతూనే ఉంటుంది. ఆది •పత్యం బీటలు పారుతున్న సందర్భంగానో, నిజాన్ని జీర్ణించుకోలేని సన్నివేశంలోనో, ప్రశ్నలకు  సమాధానాలు చెప్పుకోలేని దుస్థితిలోనో అసహనం అగ్నిపర్వతం వలె బద్దలవుతుంది.అయితే దాని ద్వారా విడుదలైయ్యే లావా వారినే దహించి వేస్తుందనే విషయాన్ని మరచి అహంకారంతో  ఊగిపోతుంటారు.

ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా ఉపాధ్యాయులను  కలుసుకొనుటకు ఆయా పాఠశాలకు వెళ్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు,వారి తరుపున ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర బాధ్యులు ఉపాధ్యాయలోకం సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అసహనంతో ఊగిపోతున్నట్లు ఉపాధ్యాయలోకం చర్చించుకుంటుంది.ఒకటికి రెండు సార్లు ఇచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోలేని ఎమ్మెల్సీలు,ఉపాధ్యాయ లోకానికి సేవ చెయ్యలేని సంఘాలు ఉపాధ్యాయుల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఎదురుదాడి చేస్తున్న సంఘటనలు చూస్తూ ఉపాధ్యాయలోకం ముక్కున వేలేసుకుంటుంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్ట్ ‌చేసి గెలిపిస్తే ఏం సాధించారని ప్రశ్నించే సోదర సంఘాలని దుర్భాష లాడుతున్నారు. మొనగాని సంఘాన్ని ప్రశ్నిస్తారా అని ఊగిపో తున్నారు.

ఉపాధ్యాయులకు ఇన్ని సంఘాలు ఎందుకని,రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును చులుకన చేస్తున్నారు.అలసత్వాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే అసహనంతో రగిలిపోతున్నారు.వోటు వేసేవారు ప్రశ్నిస్తే, సమాధానాలు చెప్పాలే గాని అసహనంతో  ఊగిపోతారా?సమాధానాలు చెప్పలేని స్థితిలో అసహనం ఎలా వ్యక్తం అవుతుందో ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.ఎంతో ముందు చూపుతో రాజ్యాంగ నిర్మాతలు ప్రభుత్వంలో ఎన్నో విభాగాలు ఉన్నప్పటికీ కేవలం విద్యా వ్యవస్థకు అందులో అధ్యాపక,ఉపాధ్యాయ వర్గానికి మాత్రమే శాసనమండలికి తమ ప్రతినిధులను ఎన్నుకొనుటకు అవకాశం కల్పించారు.సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయని  సమస్యలను గుర్తించి శాసనమండలి ముందునుంచే బాధ్యత గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలపై ఉంది.కానీ వాస్తవంగా జరుగుతున్నదేమిటి? శాసనమండలి ఏర్పడిన తర్వాత ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రెండు,మరికొన్ని ప్రాంతాల్లో మూడుసార్లు ఎన్నికలు జరిగాయి.

కనీసం ఇప్పటివరకు పదిహేను సంవత్సరాలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఉన్నారు. ఒకటిన్నర దశాబ్దాల కాలంలో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు పేరుకుపోయాయి. కొందరు తప్పిస్తే చాలామంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వారి సంఘాల పైరవీలతోనే కాలం గడిపారు కానీ ఉపాధ్యాయుల  కనీస సమస్యలు కూడా పరిష్కరించలేక పోయారు.కనీస సమస్యలు కూడా పరిష్కరించలేని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వ్యవస్థ అవసరమా అనే ప్రశ్న ఉపాధ్యాయ లోకంలో ఉదయిస్తుంది.దాని ప్రతిఫలమే ప్రచారానికి వస్తున్న సంఘాలకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆ ప్రశ్నల వర్షంలో తడిసి ముద్దవుతున్న సంఘ బాధ్యులు అసహనముతో నోరు జారుతూ ఊగిపోతున్నారు.

దీర్ఘకాలంగా అపరిస్కృత సమస్యలు అటుంచితే ఒకటవ తేదీన జీతం ఇప్పించలేని పరిస్థితి దాపురించింది. హౌసింగ్‌ ‌లోన్లు,వ్యక్తిగత లోన్లు తీసుకున్న  ఉపాధ్యాయుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల వలె మారింది. సమయానికి జీతాలు రాక, ఇఎంఐలు కట్టలేక, చెక్‌ ‌బోన్స్ అవుతూ, సిబిల్‌ ‌స్కోర్స్ ‌పడిపోతూ, జరిమానాలు కడుతున్నారు. ఉపాధ్యాయులకు కనీసం ఒకటో తారీకు జీతం ఇప్పించలేని ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అవసరమా అని ఉపాధ్యాయ లోకం ప్రశ్నిస్తుంది. ఎన్నికల సమయంలోనే సమస్యలకు పరిష్కారాలు వేతుకుతున్నట్లు నటిస్తారు.శాసన మండలిలో పోటీ పడి ప్రశ్నల వర్షం కురిపిస్తారు.ఉపాధ్యాయుల లోకం పట్ల ఎక్కడలేని ప్రేమను చూపిస్తారు.ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎల్లయ్య గొంగడి ఎక్కడ ఉందో అక్కడే ఉన్నట్లు సమస్యలన్నీ అపరిష్కృతంగా మారిపోతాయి.

గౌరవ ఎమ్మెల్యేలు గ్రామాల వెంట తిరుగుతూ చావుకు,బతుకులకు ప్రజలు వెంట నడుస్తున్నారు. పక్షుల మాదిరి పల్లెల వెంట తిరుగుతున్నారు. ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా ప్రత్యక్షమవుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలో  ఎమ్మెల్లెలు దేశానికి  ఆదర్శంగా నిలుస్తుంటే,అదే తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ  ఎమ్యెల్సీలు,వారి సంఘాలు నవ్విపోదురు నాకేమనట్లు వ్యవహరిస్తున్నారు.317 జీఓ తో ఉపాధ్యాయ లోకం స్థానికత కోల్పోయి పుట్టకొక్కరు,చెట్టుకోకరుగా మారితే అండగా నిలవల్సిన ఎమ్మెల్స్ ‌లు,వారి సంఘాలు అంతబాగుందని బడాయిలు పలుకుతున్నారు.ఉపాధ్యాయుల తరుపున ప్రశ్నించాల్సిన సంఘాలు పైరవిలతో బిజిబిజిగా ఉంటున్నాయి.ప్రశ్నించాల్సిన సమయంలో  ములాఖాత్‌  ‌కావడం,ఎన్నికల సమయంలో ప్రశ్నించినట్లు నటించడం,హడావిడి చేయడం అలవాటుగా మారిపోయింది.

ఉపాధ్యాయుడు సమాజ నిర్మాణ కర్త.రాబోయే భవిష్యత్తుకు వెలుగు మార్గం. అట్టి ఉపాధ్యాయులు వారి సమస్యల గురించి ప్రశ్నించే ప్రజాప్రతినిధులను ఎన్నుకోలేరా? ఎవరు పని చేస్తారు? ఎవరు ఎమ్మెల్సీ మాటున పైరవీలు చేస్తారో గుర్తించలేరా? ఎవరు బడి దొంగలకు సపోర్ట్ ‌చేస్తారు? ఎవరు బడుల కోసం పాటు పడతారో అంచనా వేయలేరా?.ఉపాధ్యాయ లోకమా మేల్కుందాం.సమస్యలు గాలికొదలి లాలూచీ పడే వారెవ్వరో? ఉపాధ్యాయుల పక్షం వహించి ప్రశ్నించే వారెవరో తేల్చుకుందాం.సంఘం మాటున బడి ఎగ్గొట్టి, పైరవీలు,రియల్‌ ఎస్టేట్స్ ‌దందాలు చేసేవరెవ్వరు?వారికి వత్తస్తూ పలికే వారెవ్వరో గుర్తించుకుందాం?కాంట్రాక్టు వ్యవస్థ గురించి కనీసం పల్లెత్తు మాట్లాడని వారికి వోట్టేద్దామా?కాంట్రాక్టు వ్యవస్థని రద్దు చేయాలనే వారికి వోట్టేద్దామా నిర్ణయించు కుంద్దాం.మోడల్‌ ‌స్కూల్‌ ‌టీచర్స్ ‌ట్రాస్ఫర్‌ ‌కోసం నిలదీద్దాం.కె జి బి వి ఉపాధ్యాయుల టైం స్కేల్‌ ఏమైద్దని ప్రశ్నిద్దాం..ఎటువంటి ఆశలకు,ప్రలోభాలకు లొంగకుండా మన వోటును అధ్యాపక ఉపాధ్యాయ పక్షాన నిలబడే,శాసనమండలిలో,బయట గళం విప్పే వారికి వేద్దాం. ఎమ్మెల్సీ మాటున పైరవీలకు పాల్పడే వారికి వోటు అనే వజ్రాయుధంతో బుద్ధి చెబుదాం. నిజాయితీపరులను గెలిపించుకుంద్దాం.

  image.png
జుర్రు నారాయణ యాదవ్‌,
‌తెలంగాణ టీచర్స్ ‌యూనియన్‌,
‌జిల్లా అధ్యక్షులు, మహబూబ్‌నగర్‌ , 9494019270.

Leave a Reply