‌ప్రజల సంక్షేమమే బిజెపి ఎజెండా

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో గానీ లేదా వివిధ రాష్ట్రాలలో గానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత   ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఆ విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందే విధంగా దోహదం చేస్తుంది కాబట్టే దేశవ్యాప్తంగా బిజెపి హావా కొనసాగుతుంది. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్‌షా,జాతీయ అధ్యక్షులు జె.పి. నడ్డాల ఆలోచన వ్యుహాలను బిజెపి శ్రేణులంతా  ఒక ప్రణాళిక ప్రకారం అత్యంత ఖచ్చితత్వంతో ముందుకు తీసుకెళ్తూ పార్టీ అభివృద్ధికి దోహదం చేస్తున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బలమైన జాతీయ పార్టీగా ఉన్న ఏకైక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏప్రిల్‌ 6 ‌వ తేదీ 1980 వ సంవత్సరంలో ఏర్పడిన బిజెపి క్రమక్రమంగా దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ ఏ మాత్రం పట్టులేని రాష్ట్రాలలో కూడా ఈవాళ భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది అందుకు ప్రధాన కారణం బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడూ ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి అనుకూలంగా పని చేస్తున్నందుకే భారతీయ జనతా పార్టీ దేశంలో తిరుగులేని రికార్డ్ ‌లను సాధిస్తుంది. భారతీయ జనతా పార్టీ లక్ష్యం  అయిన అంత్యోదయ లక్ష్యంతో ముందుకెళ్తూ  సమాజంలో ఉన్న చిట్టచివరి వ్యక్తికి కూడా లాభం జరగాలని ముందుకెళ్తుంది కాబట్టే బిజెపి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బలోపేతం అయింది.

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ అభివృద్ధి, ప్రగతి కోసం ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైన సిద్ధంగా ఉంటుంది. అందులో భాగంగానే జమ్మూ • కాశ్మీర్‌ ‌కు ప్రత్యేకంగా వర్తించే 370 అధికరణను రద్దు చేసి  జమ్మూ • కాశ్మీర్‌ ‌ప్రజలకు నిరంతరం పూర్తిస్వేచ్చతో జీవించే విధంగా నరేంద్రమోడీ ప్రభుత్వం చొరవ తీసుకోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్‌ ‌లోని అయోద్య రామమందిరాన్ని నిర్మించిన విధంగానే త్వరలోనే మధురలో శ్రీ. కృష్ణ దేవాలయాన్ని నిర్మి స్తామని చెప్పడం వంటిది కూడా ఒక సాహసోపేత నిర్ణయమే. ప్రపంచంలోనే భారతదేశాన్ని రక్షణరంగంలో తిరుగులేని శక్తిగా తయారుచేయ్యాలనే దృఢ సంకల్పంలో అమెరికా, రష్యా,జపాన్‌, ఆ‌స్ట్రేలియా, బ్రిటన్‌, ‌ఫ్రాన్స్, ‌జర్మనీ వంటి అబివృద్ధి చెందిన దేశాలతో రక్షణ రంగంలో కీలక ఒప్పందాలు చేసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వం రక్షణరంగంలో పేను మార్పులను తీసుకవచ్చి ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద రక్షణ వ్యవస్థ కల్గిన దేశంగా నరేంద్ర మోడీ తీర్చిదిద్దారు.

ఈ విధంగా భారతదేశాన్ని అన్ని రంగాలలో సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని  తెలిసి భారతదేశ ప్రజలు మొత్తం ఈ భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. అందుకే బిజెపి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే ఎన్నికలలో ప్రజల తీర్పు ఉంటుందని తాజాగా జరిగిన ఐదు  రాష్ట్రాల అస్సెంబ్లీ ఎన్నికలు తెలియజేశాయి.పార్టీ పటిష్టం కోసం జాతీయ నాయకత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయి నుండి బూత్‌  ‌స్థాయి వరకు పకడ్బందీగావెళ్లే విధంగా ప్రత్యేక కార్యాచరణను రూపోందిస్తూ, అన్ని స్థాయిలలో అన్ని రకాల కమిటీలను పూర్తి చేస్తూ  పార్టీని బలోపేతం చెయ్యడమే ఆశయంగా మార్గదర్శనం చేస్తారు . పార్టీ బలోపేతానికి  గల కారణాలు ఏవి అని తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా  చేస్తుంది.

కాంగ్రెస్‌ ‌మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉంటే అధికార దుర్వినియోగానికి పాల్పడటం, కుటుంబపాలనను ప్రవేశపెట్టడం వంటి అంశాలను ప్రజలకు చేరవేయడంలో బిజెపి పార్టీ సఫలం అవుతుంది. అంతేకాదు బిజెపి అధికారంలోకి వస్తే దేశ ప్రగతి కోసం, ప్రజల సంక్షేమం కోసం చేసేటువంటి పనులేవీ అనేవి స్పష్టంగా బిజెపి పార్టీ వివరిస్తుంది.క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం కీలకంగా వ్యవహరించేవి మోర్చాలు. యువమొర్చా, ఓబీసీ మోర్చా, దళిత మోర్చా, గిరిజన మోర్చా, మహిళ మోర్చా, మైనార్టీ మోర్చా, కిసాన్‌ ‌మోర్చాలు. వాస్తావానికి కొత్త వారిని పార్టీకి పరిచయం చేసి, పార్టీలోకి చేర్చడమే ఈ మోర్చాల పని, ఒక రకంగా చెప్పాలంటే మోర్చాలు పటిష్టం అయినప్పుడే పార్టీ కూడా క్రమక్రమంగా అబివృద్ధి చెందుతుంది.

ఈశాన్య రాష్ట్రాలలో ఎప్పుడు లేని విధంగా నేడు భారతీయ జనతా పార్టీ ప్రభంజనం కొనసాగుతుంది ఆ విధంగా ప్రజల కోసం, ప్రజలకు కావాల్సిన విధంగా పరిపాలన చేస్తున్నందుకే  బిజెపి తిరుగులేని శక్తిగా ఉద్భవించింది.ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల నుండి  రాజ్యసభలో కాంగ్రెస్‌ ‌ప్రాతినిధ్యం  లేదు అంటే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షులు జె. పి.నడ్డా ల నాయకత్వంలో ఒక పక్క కాంగ్రెస్‌ ‌రహిత దేశంగా మార్చుతూ మరోపక్క  భారతీయ జనతా పార్టీ విజయం పరంపర కొనసాగే విధంగా వ్యుహాలను అమలు చేస్తూన్నారు.
డా. ఎన్‌. ‌గౌతమ్‌ ‌రావు, బిజెపి అద్యక్షులు,
       హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page