- ఫార్మా కంపెనీలకు హబ్‌గా తెలంగాణ
- దేశంలో సక్సెస్‌ఫుల్ స్టార్ట్ అప్ కంపెనీలకు అడ్రస్
- నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఆవిర్భావం
- ఆత్మనిర్భర భారత్‌తో పెద్దగా ప్రయోజనం లేదు
- మంత్రి కెటిఆర్ అభిప్రాయం
హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి2: తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందని మంత్రి కెటిఆర్ అన్నారు. దేశంలో సక్సెస్ ఫుల్ స్టార్ట్ అప్ అంటే తెలంగాణ రాష్ట్రం అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ దేశంలో నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అని చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రంలో ఎన్నో స్టార్టప్‌లో సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్నాయన్నారు. ముఖ్యంగా ఫార్మా కంపెనీలకు హబ్‌గా మారి ందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ హైదరాబాద్ భాగస్వామ్యం ప్రపంచానికి తెలిసిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అధికా ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తెలంగాణలో మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. టీఎస్ ఐ పాస్‌తో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అను మతులు ఇస్తున్నామని తెలిపారు. విభజన సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నా.. మౌలిక వసతుల్లో ముందుకు దూసుకెళ్తున్నామన్నారు. అగ్రి ఉత్పత్తులు కూడా రాష్ట్రంలో బాగా పెరిగాయని ఆయన అన్నారు. రైతులకు సాయం అందించేందుకు రైతుబంధు తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. పారిశ్రామిక అభి వృద్ధి కూడా రాష్ట్రంలో వేగంగా జరుగు తోంద న్నారు.
ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజితో చాలా మందికి ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. ఇన్వెస్ట్ ఇండియా కూడా పరిశ్రమలకు మరింత సహకారం అందించాలన్నారు. సీఐఐ కూడా కేంద్రం దగ్గర గట్టిగా మాట్లాడి కొత్త పరిశ్రమలకు లబ్ది చేకూరేలా చూడాలని మంత్రి కేటీఆర్ కోరారు. టిఆర్‌ఎస్ ఎనిమిదిన్నరేండ్ల పాలనలో తలసరి ఆదాయం బాగా పెరిగిందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 2.78 లక్షలకు చేరిందన్నారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత పెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే అని కేటీఆర్ స్పష్టం చేశారు. 20 ఏండ్ల క్రితం హైదరాబాద్‌లో పెద్దగా కంపెనీలు లేవు. ఇప్పుడు హైదరాబాద్‌లో అనేక ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఉన్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆవిష్కరణలు, స్టార్టప్‌లను బాగా ప్రోత్సహిస్తుందన్నారు. తెలంగాణలో ఎన్నో స్టార్టప్‌లు వచ్చి విజయవంతంగా నడుస్తున్నాయి. తమ ప్రభుత్వం తెచ్చిన టీఎస్ ఐపాస్ బాగా విజయవంతమైందన్నారు. పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు.
500 టర్ల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న పరిశ్రమలకు సత్వర అనుమతి ఇస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రంతో పాటు చాలా రాష్టాల్రు కాపీ కొట్టాయని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే పూర్తి చేశాం. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను ప్రతి ఎకరాకు అందిస్తున్నామన్నారు. వ్యవసాయరంగంలో కూడా తెలంగాణ అభివృద్ధి చెందిందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. పంజాబ్ కంటే అధికంగా వరి ధాన్యాన్ని పండించామని చెప్పారు. ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి కూడా రైతులకు లబ్ది చేసే చర్యలు తీసుకోలేదు. కానీ సీఎం కేసీఆర్ వ్యవసాయ పెట్టుబడి కోసం రైతుబంధు కింద సంవత్సరానికి రెండుసార్లు ఎకరాకు రూ. 5 వేల చొప్పున ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 నుంచి 31 శాతానికి పెంచామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్‌గా మారిందని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి అన్ని దేశాలకూ ఔషధాలు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. వ్యాక్సిన్ల ఉత్పత్తికి తెలంగాణలో అన్ని వసతులు ఉన్నాయన్నారు. తెలంగాణ మెడికల్ హబ్‌గా మారిందన్నారు. తెలంగాణ నుంచి అన్ని దేశాలకూ ఔషధాలు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు.