Take a fresh look at your lifestyle.

పుంజుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థ

  • ప్రపంచంలో స్థిరత్వం, విశ్వాసం, వృద్ధికి కృషి
  • జి20కి ఆతిథ్యంతో బలపడుతున్న ఆర్థిక బంధం
  • ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌గవర్నర్లతో ప్రధాని మోదీ
  • బెంగళూరు జి20 సన్నాహక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ 

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 24 : జి20 సదస్సుకి ఆతిథ్యమివ్వడంతో భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రపంచంలో స్థిరత్వం, విశ్వాసం, వృద్ధిని తిరిగి తీసుకురావడానికి కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జి-20 సమావేశం సందర్భంగా ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌గవర్నర్లతో ప్రధాని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. బెంగళూరులో ప్రారంభమైన జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌గవర్నర్ల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, అధిక రుణాల వంటి ప్రపంచసవాళ్లను ఎదుర్కుంటున్న తరుణంలో బహుపాక్షిక బ్యాంకుల అభివృద్ధిని బలోపేతం చేయాల్సి వుందని అన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మహమ్మారి, యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు దెబ్బతీశాయని అన్నారు. ఈ పరిణామాలతో పలు దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయని అన్నారు. మరింత సురక్షితమైన, విశ్వసనీయమైన, సమర్థవంతమైన పబ్లిక్‌ ‌డిజిటల్‌ ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌ని సృష్టించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన డిజిటల్‌ ‌చెల్లింపులు పర్యావరణ వ్యవస్థ, పాలన, ఆర్థిక, జీవనోపాధిని సమూలంగా మార్చిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ వినియోగదారులు, తయారీదారులు భవిష్యత్తు గురించి ఆశాజనకంగా, నమ్మకంగా ఉన్నారని..వి•రు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల స్ఫూర్తిని అందించాలని అన్నారు ప్రధాని మోదీ. చర్చలో ప్రపంచంలోని అత్యంత బలహీనమైన పౌరులపై దృష్టి పెట్టాలని తాను కోరుతున్నాని అన్నారు. గ్లోబల్‌ ఎకనామిక్‌ ‌లీడర్‌షిప్‌ ఒక సమగ్ర ఎజెండాను రూపొందించడం ద్వారా మాత్రమే ప్రపంచ నమ్మకాన్ని తిరిగి పొందగలుగుతుందని సూచించారు ప్రధాని మోదీ.

భారతీయ వినియోగదారులు భవిష్యత్తు గురించి ఆశాజనకంగా, నమ్మకంగా ఉన్నారు. వి•రు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల వైఖరిని అందిస్తారని ఆశిస్తున్నామని  ఈ సందర్భంగా ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌గవర్నర్ల సమావేశంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కోవిడ్‌ ‌మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. అనేక దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, ఇప్పటికీ ఆ పరిణామాలను ఎదుర్కుంటున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ‌గవర్నర్ల తొలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత దాస్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply