పసిడి పంటల పాలమూరు

నేటి పాలమూరు పసిడి పంటల
పచ్చని పైరులతో దర్శనము ఇస్తూ

ఆనాటి కరవు జిల్లా ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌
ఎ‌ర్రలు వారినా నేల, పక్కనే కృష్ణమ్మ
పరుగులు తీస్తున్న చుక్క నీరు అందల్ఱే
రైతన్న వరుణ దేవుడిని నమ్ముకొని గింజలు ఎసిన
వానకు ఆకాశానికై ఎదురు చూపు…..

పశు గ్రాసాన్ని పక్క రాష్ట్రాల నుంచి తెచ్చిన
రోజులు మరువలే పాలమూరు వాసులు….
మూగ జీవాల మేపుకై డీసిఎంలో గొర్లకాపర్లు
సరిహద్దు రాష్ట్రాలకు వెళ్లి బిక్కు బిక్కుమంటూ
గడిపిన రోజులు యాదిలో ఉన్నాయి….

పాలమూరు ప్రజలు ఆకలికై పల్చటి మజ్జిగలో
రాయిటా బురద కలుపుకుని తాగిన రోజులు
పేదల ఆకలికై ఊరురా అంబలి కేంద్రాలు నడిపిన
రోజులు పాలమూరు ప్రజల స్థితిగతులు
అద్దం పడుతాయి……

ఆనాడు కవులు, కళాకారులు, రచయితలు
కలం పట్టి రాసిన కన్నీటి జల దారలతో
పేపర్‌ ‌తడవదే కవిత్వం, రచన పూర్తయ్యేది కాదు

పూటకు లేక పసి బిడ్డలను అమ్ముకున్న రోజులు
జీవనోపాధికై ముంబైక్ఱేల్లినా తల్లి, గుక్కపట్టి ఎడుస్తూ అవ్వతాత దగ్గర జొన్న సంకటి తింటూ చంటోడు
ఆనాటి పరిస్థితుల నుండి నేడు పాలమూరు
ధాన్యగారముతో దేశానికే అన్నం పెడుతుంది.

కేసిఆర్‌ ‌ప్రత్యేక దృష్టితో పాలమూరు పచ్చబడింది
నాటి పాలమూరు మరో కోన సీమను తలపిస్తుంది……
– మిద్దె సురేష్‌, ‌కవి, వ్యాసకర్త
     9701209355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *