దేశంలో నిలకడగా కొరోనా రోజువారీ కేసులు

కొత్తగా 13,615 మందికి పాజిటివ్‌…20 ‌మంది మృతి
న్యూ దిల్లీ, జూలై 12: దేశంలో కొరోనా కేసుల సంఖ్య కొంచెం అటుఇటుగా నిలకడగా ఉంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 13,615 మంది వైరస్‌ ‌బారినపడగా.. మరో 20మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌ ‌నుంచి తాజాగా 13,265 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.50 శాతానికి పడిపోయింది. రోజువారీ పాజిటివిటీ రేటు మాత్రం 3.23 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 13,615 కొవిడ్‌ ‌కేసులు నమోదయ్యాని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 13,265 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి కారణంగా మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం దేశంలో 1,31,043 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.23శాతంగా ఉన్నది. తాజాగా నమోదైన కేసులతో 4,36,52,944కు చేరింది. ఇందులో 4,29,96,427 మంది కోలుకున్నారు. 5,25,474 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ‌కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 1,99,00,59,536 డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *