Take a fresh look at your lifestyle.

టీడీపీ అధికారంలోకి రాగానే ఏటా జాబ్‌ ‌క్యాలెండర్‌

  • పిజి వరకు ఉచిత బస్‌ ‌పాస్‌ ‌సౌకర్యం
  • విద్యా బోధనలో సమూల మార్పులు తీసుకొస్తాం
  • పాదయాత్రలో యువతతో లోకేశ్‌ ‌ముఖాముఖి

తిరుపతి, మార్చి1 : టీడీపీ అధికారంలోకి రాగానే జనవరి 1, 2025న జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌విడుదల చేస్తామని.. అలాగే ప్రతి సంవత్సరం జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌విడుదల చేస్తామని నారా లోకేష్‌ ‌హా ఇచ్చారు.యువతకు ఉపాధి,ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. వారికి ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగాలకల్పకు కృషి చేస్తామన్నారు.  యువగళం పాదయాత్రలో భాగంగా ఇర్రంగారిపల్లిలో చంద్రగిరి యువతతో నారా లోకేష్‌ ‌ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పుడు టెన్త్ ‌క్లాస్‌ ‌వరకు బస్సు పాస్‌ ఇస్తున్నారు.. తెలుగుదేశం అధికారంలోకి వస్తే పీజీ వరకు ఉచిత బస్సు పాస్‌  అం‌దజేస్తాం. ఇక వసతి విద్యా దీవెనను రద్దు చేసి నేరుగా కాలేజీలకే ఫీజులు చెల్లిస్తాం.

స్టేట్‌ ‌బోర్డ్ ‌సిలబస్‌ ‌కేజీ నుంచి పీజీ వరకు పూర్తిగా మార్పు చేసి విద్యా బోధనలో సమూల మార్పులు తీసుకొస్తాం అన్నారు.  31 రోజుల పాదయాత్రలో నాలో చాలా మార్పు వచ్చింది. పాలసీలు నాలుగు గోడల మధ్య తీసుకునేది కాదు. పాలసీల వల్ల ప్రజలకి చెడు జరగకుండా ఉండాలంటే ప్రజల మధ్య తీసుకోవాలన్నారు. కేజీ నుంచి పీజీ  వరకు మహిళను గౌరవించడం అనేది విద్యా బోధనలో భాగం కావాలి. అలాగే న్యాయవ్యవస్థలో కూడా సంస్కరణలు రావాలి. న్యాయవ్యవస్థకి సరైన వసతులు బ్జడెట్‌ ‌కేటాయింపుల్లో పెరిగితే త్వరగా న్యాయం జరుగుతుంది. న్యాయం త్వరగా జరగకూడదు అనే దురాలోచనతోనే జగన్కోర్టు కాంప్లెక్స్‌లో నిర్మాణాన్ని ఆపేశారు. జైలు జగన్‌ ‌పోయి.. బ్రాండ్‌ ‌బాబు  రావాలంటే యువత ఓటు నమోదుపై దృష్టి పెట్టాలని నారా లోకేష్‌ ‌పిలుపు నిచ్చారు.

Leave a Reply