చైనాలో మళ్లీ పంజా విసురుతున్న కొరోనా

వేల సంఖ్యలో కేసులు నమోదు…పలు నగగరాల్లో లాక్‌డౌన్‌
‌న్యూ దిల్లీ, మార్చి 19 : చైనాలో కొరోనా మళ్లీ పంజా విసురుతుంది. గత రెండేండ్లల్లో ఎన్నడూ లేని విధంగా అక్కడ వైరస్‌ ‌విజృంభిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా స్టెల్త్ ఒమిక్రాన్‌ ‌కేసులు డ్రాగన్‌ ‌కంట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది.
ఇప్పటికే 13 ప్రధాన నగరాల్లో పూర్తిగా లాక్‌ ‌డౌన్‌  ‌విధించింది. మరికొన్ని నగరాల్లో పాక్షిక లాక్‌ ‌డౌన్‌లు విధించింది. విదేశీ ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించింది. చైనాలోని పలు సిటీల్లో రోజూ రెండు మూడు వేల చొప్పున కొరోనా కేసులు నమోదవుతున్నాయని ఆ దేశ జాతీయ ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. చైనాలో ఏడాది తర్వాత తొలిసారి రెండు కొరోనా మరణాలు నమోదైనట్లు నివేదించారు. 2021 జనవరి తర్వాత మళ్లీ చైనాలో కొరోనా మరణాలు సంభవించడం ఇదేనని చెప్పారు.
ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌సరికొత్త రూపాయన్ని సంతరించుకుంటూ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. దక్షిణ కొరియాలో రోజు లక్షల్లో కొరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం నాడు 6 లక్షలకు పైగా కొత్త కేసులు రాగా.. శుక్రవారం 3,81,454 మంది వైరస్‌ ‌బారినపడ్డారని కొరియన్‌ ‌డిసీజ్‌ ‌కంట్రోల్‌ ‌ప్రవెన్షన్‌ ఏజెన్సీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *