కామారెడ్డి ఘటనపై సిఎం కెసిర్‌,‌ మంత్రి దిగ్భ్రాతి

మృతుల కుటుంబాలకు 3లక్షల చొప్పున పరిహారం
నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ వర్కర్స్ ‌కాలనీలో విద్యుత్‌ ‌షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన కలచివేసింది. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ‌తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్‌, ‌మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న హైమద్‌ (35),అతని భార్య పర్వీన్‌(30), ‌కుమారుడు అద్నాన్‌ (4), ‌కూతురు మాహిమ్‌(6)‌ల మృతి చాలా బాధాకరం అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కామారెడ్డి ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ‌పరామర్శిం చారు. మృతులకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం ప్రకటించారని మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి వెల్లడించారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన వార్త విని.. కేసీఆర్‌ ‌చలించిపోయారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్ర స్థాయిలో అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న వెంటనే మానవతా దృక్పథంతో మృతులకు రూ. 3 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించిన ముఖ్యమంత్రికి మంత్రి వేముల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *