ఎస్సీ వర్గీకరణను అమలు చేయండి

సిఎం రేవంత్‌ను కోరిన ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌తెలంగానలోఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్‌ ‌వ్యవస్థాపక అధ్య క్షుడు మందకృష్ణ మాదిగ సిఎం రేవంత్‌ ‌రెడ్డిని కోరారు. సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పు వొచ్చిన దరిమిలా సిఎం గతంలోనే హావ్ని ఇచ్చిన ందున తక్షణం ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ‌నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని కలిసిన ఎమ్మార్పీఎస్‌ ‌వ్యవస్థా పక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గురువారం కలిసారు.

మందకృష్ణతో పాటు ముఖ్య మంత్రిని మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్‌, •తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి సిఎం సానుకూలత వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *