అమరావతి,జనవరి3 : రాష్ట్రంలో రోడ్లపై సభలు, ర్యాలీలపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇటీవల చంద్రబాబు సభల్లో వరు మరణాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలు, బహిరంగ సభలపై పరోక్షంగా వేటు పడింది. పంచాయతీరాజ్, మున్సిపల్ రహదారులపై సభలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. అధికారులు నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే సభలు పెట్టాలని ప్రభుత్వం నిబంధన విధించింది.
ఈ సభలకు కూడా షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని సూచనలు చేసింది. వీటిని ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. చంద్రబాబు సభలకు జనం పోటెత్తుతున్న నేపథ్యంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చిందనే ఆరోపణలు వినబడుతున్నాయి. కందుకూరు, గుంటూరు సభలకు వచ్చిన అశేష జనవాహినితో ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది.