ఎపిని అప్పుల ప్రదేశ్‌గా మార్చారు

  • అప్పులతో ఎంతకాలం నడిపిస్తారో తెలియదు
  • రాయలసీమ రణభేరిలో కిషన్‌ ‌రెడ్డి వ్యాఖ్యలు

కడప, మార్చి 19 : ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎక్కడ అప్పులు పుడతాయా అనే స్థితిలోకి ఏపీ వెళ్లిందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పులు చేసి ఎన్నాళ్లు నెట్టుకువెళ్తారని ప్రశ్నించారు. పాలన ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండ దన్నారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో ల్యాండ్‌, ‌లిక్కర్‌ ‌మాఫియాలు రాజ్యమేలు తున్నాయని చెప్పారు. ఏపీలో జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. బీజేపీలో చేరేవారిని వేధిస్తున్నారంటూ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ ‌చేశారు.రాయలసీమ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ‌రావాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని స్పష్టం చేశారు. ఏపీలో మాఫియా కల్చర్‌ ‌పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వం ఎక్కువ కాలం నిలబడదని కామెంట్‌ ‌చేశారు. కడపలో బీజేపీ రాయలసీమ రణభేరి సభకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పులు చేసి రాష్టాన్న్రి ఎన్నాళ్లు నెట్టుకొస్తారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

 

ఏపీలో పాలన ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని వ్యాఖ్యానించారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కిషన్‌రెడ్డి స్పందించారు. సీమ అభివృద్ధి కోసం జగన్‌ ఏం ‌చేశారో చెప్పాలన్నారు. రాయలసీమకు రతనాలసీమ అని పేరు ఉందని అలాంటి రతనాల సీమ ఈ రోజు వెనుకబడిపోయిందని కిషన్‌రెడ్డి తెలిపారు. సీమ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేయలేదని ఆయన విమర్శలు చేశారు. ఏపీలో బీజేపీలో చేరేవారిని ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

కాగా అంతకుముందు కడప చేరుకున్న కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శాలువా కప్పి ఆత్మీయంగా స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *