ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖకు తన తాజా బడ్జెట్లో 11237.33 కోట్లు కేటాయించి ఆరోగ్యశాఖకు అత్యంత ప్రాధాన్యత నిచ్చింది. గత ఏడాది కన్నా మూడింతలు అధికంగా నిధులు కేటాయించడం విశేషం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పై గల చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది.రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నెలకొల్పుతున్న వైద్య కళాశాలలకు వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది.

తెలంగాణలోనే మొదటి సారిగా మహిళల కోసం
 ‘‘ఋతు ప్రేమ’’ పేరిట సరికొత్త కార్యక్రమానికి సిద్దిపేట మున్సిపాలిటీ ఐదవ వార్డు వేదికగా బుధవారం శ్రీకారం చుట్టిన మంత్రి హరీష్‌ ‌రావు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని అన్ని రంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురై వెనుకబడి ఉండేవి. అందులో వైద్యరంగం కూడా ఒకటి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ముఖ్య మంత్రి  కె.చంద్రశేఖర్‌ ‌రావు  ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలతో వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి పటిష్టం చేయడంతో  కొరోనా సంక్షోభాన్ని కూడా తట్టుకొని దేశంలోనే సగర్వంగా నిలబడగలిగాం . ముఖ్యమంత్రి  కొరోనా మహమ్మారిని  కట్టడి చేయడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే ఏ మహమ్మారి నైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండేలా వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నారు.
సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రాధమికంగా పౌరులకు కావలసినవి విద్య మరియు వైద్యం. పౌరులు శారీరకంగా,మానసికంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా సామాజికంగా ఎదుగ గలుగుతారు. వీటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  వైద్యరంగంలో అనేక సంస్కరణలు చేపట్టి ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే దేశంలో ఎక్కడలేని విధంగా పలు వైద్య ఆరోగ్య పథకాలను తీసుకువచ్చి వాటిని పటిష్టంగా అమలు పరుస్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
             ప్రభుత్వ దవాఖానాలలో  ప్రసవాలు పెరగడం కూడా దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. రాష్ట్రప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించే క్రమంలో ‘‘ఆరోగ్యశ్రీ’’ పథకాన్ని అమలు చేయడమే గాకుండా గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకు పౌష్టికాహారం అందించే దిశగా ‘‘బాలామృతం’’ పథకాన్ని మరియు ‘‘ఆరోగ్యలక్ష్మి’’ పథకాన్ని  అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నది. ‘‘అమ్మఒడి’’ పథకం ద్వారా ప్రభుత్వ దవాఖానాల్లో  ప్రసవించిన మహిళలను ప్రభుత్వ వాహనంలో ఇంటికి ఉచితంగా చేరవేస్తుంది..
అదేవిధంగా ప్రభుత్వ దవాఖానాలో  గర్భిణీ స్త్రీలకు అనేక సౌకర్యాలు కల్పించి, ఉచిత వైద్య సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో ‘‘కెసిఆర్‌ ‌కిట్‌’’ ‌పథకాన్ని ప్రవేశపెట్టారు.దీనితో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. రెండు ప్రసవాలకు ఒక్కోసారి పన్నెండు వేల రూపాయలు  నగదు రూపేణ ప్రభుత్వం అందిస్తున్నది. బాలిక జన్మిస్తే మరో వెయ్యి రూపాయలు అదనంగా అందజేస్తున్నది.. ముఖ్యంగా ఈ పథకం వల్ల మాతా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిపోయినవి.
పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పరచిన ‘‘బస్తీ దవాఖాన’’లు ఎంతగానో ఉపయోగపడుతున్నయి . తమ ఆరోగ్య సమస్యల గురించి పేద ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి ఆర్థికంగా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పేదల  బస్తీలకు చేరువలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నవి.
నీతి అయోగ్‌ ‌వెలువరించిన ‘‘ఆరోగ్య రాష్ట్రాలు- ప్రగతిశీల భారతదేశం’’ నివేదికలో భారత దేశ వ్యాప్త ఆరోగ్య సూచిలో తెలంగాణ రాష్ట్రం వయసులో చిన్న రాష్ట్రమైన అద్భుతమైన పనితీరు కనబరిచింది. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానాల్లో జరిగిన ప్రసవాల్లో 96.3 శాతంతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పిల్లలకు టీకాలు వేయించే విషయంలో కూడా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్ర భాగాన నిలిచింది. రాష్ట్రంలోని పిల్లలందరికీ వంద శాతం టీకాలు వేసి తెలంగాణ రాష్టం చరిత్ర సృష్టించింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వంద శాతం జననాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నవని  నీతి అయోగ్‌ ‌స్పష్టంచేసింది. టీబి కేసుల గుర్తింపు లో కూడా తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. జిల్లా దవాఖానాల్లోని బాలింతల వార్డుల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఉన్న ఎకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వీటన్నిటితోపాటు గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఏఎన్‌ఎం‌లు, వైద్యాధికారులు ఉండడంతో ప్రసూతి మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం తదితర అంశాల కారణంగా నీతి అయోగ్‌ ‌వార్షిక ప్రగతిలో మన ప్రగతి అద్భుతంగా ఉండడం ప్రధాన కారణంగా చెప్పకోవచ్చు.
ఇటీవల దేశ వ్యాప్తంగా నిర్వహించిన ‘‘హెల్దీ అండ్‌ ‌మిషన్‌ ‌ఫిట్‌ ‌నేషన్‌’’ ‌ప్రచారంలో భాగంగా మూడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా తెలంగాణకు రెండు అవార్డులు దక్కడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.తెలంగాణ ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘‘పల్లె ప్రగతి’’ ‘‘పట్టణ ప్రగతి’’ కార్యక్రమాల వలన రాష్ట్రంలో సీజనల్‌ ‌వ్యాధులు పూర్తిగా తగ్గిపోయాయి. ముఖ్యంగా ఆరోగ్య తెలంగాణ కల సాకారం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా రూపొందించిన ‘‘తెలంగాణ హెల్త్ ‌ప్రొఫైల్‌’’ ‌ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నది. రాష్ట్రంలోని పౌరులందరికీ  డిజిటల్‌ ‌హెల్త్ ‌ప్రొఫైల్‌ ‌ను రూపొందించే దిశలో ఈ  ప్రాజెక్టును మార్చి 5వ తేదీన ములుగు మరియు సిరిసిల్ల జిల్లాలో మొదటగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 18 సంవత్సరాలు పైబడిన పౌరులందరికీ హెల్త్ ‌ప్రొఫైల్‌ ‌నిర్వహిస్తారు. దీనిలో దాదాపు ముపైకి పైగా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. దీనితో దీర్ఘకాలిక రోగాలను ముందుగానే గుర్తించడం సరైన వైద్యం సకాలంలో అందించడం జరుగుతుంది. ఈ హెల్త్ ‌ప్రొఫైల్‌ ‌పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది అని చెప్పవచ్చు.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖకు తన తాజా బడ్జెట్లో 11237.33 కోట్లు కేటాయించి ఆరోగ్యశాఖకు అత్యంత ప్రాధాన్యత నిచ్చింది. గత ఏడాది కన్నా మూడింతలు అధికంగా నిధులు కేటాయించడం విశేషం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పై గల చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది.రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నెలకొల్పుతున్న వైద్య కళాశాలలకు వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది. హైదరాబాదుకు నలువైపులా గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, అల్వాల్‌, ఎ‌ర్రగడ్డలో సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్స్  ఏర్పాటు చేస్తుంది . దాదాపు అన్ని జిల్లాల్లో విడతలవారీగా రెండు సంవత్సరాల లోపు వైద్య కళాశాలల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది . జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటుతొ మారుమూల ప్రజలకు కూడా స్పెషాలిటీ, సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పవచ్చు.ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వైద్య ఆరోగ్య శాఖ దేశానికి దిక్సూచి గా నిలుస్తున్నది . కెసిఆర్‌ ‌కలలు గన్న అరోగ్య తెలంగాణలో ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతున్నదని చెప్పవచ్చు.
పుల్లురు వేణు గోపాల్‌, 9701047002, అసోసియేట్‌ అధ్యక్షులు,టీ ఎన్‌ ‌జీ ఓస్‌ ‌యూనియన్‌, ‌హనుమకొండ జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page