సౌలత్ లు కరువైన సర్కార్ బడులు..  నేడు బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు

        తెలంగాణ సర్కార్ విద్యారంగం పై పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ,”ప్రభుత్వ రంగంలో విద్య” అందించే బాధ్యతలనుండి తప్పు కుంటున్నది.కేజీ టు పిజి వరకు సర్కార్ ఉచిత విద్య పేరిట ఇచ్చిన హామీని నెరవేర్చటంలో విఫలమయిన తెరాస ప్రభుత్వం  తెలంగాణ సమాజాన్ని మోసగిస్తుందని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి దూరంచేస్తున్న ఫలితంగానే రాష్ట్రంలో 35 శాతం ప్రభుత్వ బడులలో విద్యార్థుల చేరిక లేదు. జీరో నమోదు పాఠశాలల సంఖ్య పెరగటానికి ప్రభుత్వ విధానాలే కారణమని తెలంగాణ సమాజం తెలుసుకోవల్సివుంది.క్రమంగా జీరో నమోదు పాఠశాలల సంఖ్య పెంచి ఆ పాఠశాలలను మూసేయాలని , ఆ భూములను అమ్మడానికి చేస్తున్న చాపకింద నీరు లాంటి ప్రభుత్వ విధానాలను సమిష్టిగా  తెలంగాణ విద్యార్థులు అడ్డుకుంటారు.ఈ మేరకు రాష్ట్రం లో 12 బుధవారం పాఠశాలలు ,కళాశాలల బంద్  నిర్వహించాలని తొమ్మిది విద్యార్థి సంఘాలు ఉమ్మడిగా  పిలుపునిచ్చాయి.
     ఆచరణలో సర్కార్ విద్యను  సర్వతోముఖ సమస్యల నిలయంగా మార్చి విద్యను సామాన్యులకు అందని పండుగా మారుస్తున్నది. నాణ్యమైన విద్యను అందించటంలోనూ, కనీస  పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ  సర్కార్ విద్య పై సామాన్యుల దృష్టిని పక్క
దారి మల్లిస్తున్నది. 2014 రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో 11 శాతంగా వుండిన విద్యపై నిధులు క్రమంగా యేటా తగ్గుతూ గత రెండేళ్ళుగా 6,57 శాతానికి దిగజారడం గమనించాలి.గత తొమ్మిదేళ్ళుగా ఉపాధ్యాయుల ఖాలీ లను నింపే డి.ఏస్.సి.ల నిర్వహణ లేదు.రాష్ట్రంలో 20 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాలీ లున్నాయి.పదోన్నతులు లేక వేల సంఖ్యలో హైస్కూల్ ఉపాధ్యాయుల పోస్ట్ లు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల, మండల విద్యా
ధికారుల పోస్టులు ఖాలీ లున్నాయి. కారుణ్య, నియమాకాలు మినహాయించి జూనియర్ అసిస్టెంట్ ,రికార్డ్ అసిస్టెంట్, వాచ్ మెన్, పోస్టులు నింపటం లేదు.గత నాలుగేళ్ళ క్రితం రూ. వెయ్యి , రెండున్న వేల తో రెండేళ్ళ పాటు ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలికంగా నియమించిన స్కావెంజర్ పోస్ట్ లను కరోన సంక్షోభం తరువాత తిరిగి నియమించటం లేదు.బడలో తరగతి గదులు, వసారాలు ఊడవటం , బేంచీలు కుర్చీలు తుడవటం, వాష్ రూంలు ,కడగటం పనులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే చేసుకుంటున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు కు పెంచిన వేతనాలు ఇవ్వటం లేదు. నెలసరి బిల్లుల చెల్లింపు ఆలస్యాలు వీటిని భరించలేక వారు జూలై 10 నుండి వంట మానేసి ఉద్యమబాట పట్టారు.మన ఊరు/బస్తీ- మనబడి పథకం కింద మొదట విడత, రెండవ విడత పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లకు బిల్లం చెల్లించక పోవటంచే పనులు నిలిచిపోయాయి.దైర్యంతో సొంత డబ్బుతో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లున్న కొద్ది ప్రాంతాల్లో  పనులు నడుస్తున్నాయి. బాలికలకు ప్రత్యేకంగా వాష్ రూంలు లేకపోవటం పై సంప్రీంకోర్టు వాఖ్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఏకరూప దుస్తుల పంపిణీ,పాఠ్య,నోట్ పుస్తకాల పంపిణీ  పూర్తి కాలేదు. అన్నో టైటిల్స్ అందచేయటంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ పరిస్థితులలో అన్ని బడులలో మొదటి ఫార్మాటివ్ అస్సెస్ మెంట్ షెడ్యూల్ ప్రారంభమయింది. అప్పో సప్పో చేసి మధ్య, దిగువ , పేద ,కార్మికుల కుటుంబాల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేట్ బడులలో చదివించక తప్పటం లేదు. అనేక సమస్యలతో నిండిన  ప్రభుత్వ బడులలో ఇప్పటి వరకు నమోదైన విద్యార్థులు  వేరే బడిబాట పడ్తున్నారు.
      గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరం పేర్లతో ఏర్పాటు చేసిన 900 రెసిడెన్షియల్ బడులలో 600 పాఠశాలలకు సొంతభవనాలు లేవు. దాదాపు సగం రెసిడెన్షియల్ బడులలో కనీస మౌలిక వసతులు లేవు. పూర్తిస్థాయి బోధన బోధనేతర సిబ్బంది లేదు. నైట్ వాచ్ మెన్ విధులను కూడా మహిళా ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న కె.జి.బి.వి.లున్నాయి. పర్యవేక్షణ కరువై నిర్వహణలో అవినీతి చోటు చేసుకుంటుంది.  వండిన భోజనం తరచూ విషాహారమై విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రయివేట్ పాఠశాలల్లో విద్యార్థులు నుండి యాజమాన్యాలు వసూలు చేసే రకరకాల ఫీజులు యేటేటా రెట్టింపై చదువు వ్యాపార సరుకుగా మార్చారు.సిలబస్ కు సంబంధించిన రకరకాల అదనపు ప్రచురణలను,వర్క్ బుక్ లను అవసరమైనవిగా చూపి వాటిని అధికధరలకు బలవంతంగా విద్యార్థుల చేత కొనిపిస్తున్నారు.వారి శారీరక మానసిక వయసులను పరిగణనకు తీసుకోకుండా అధిక స్థాయి ఇంటిపని,రాతపనులను ఇస్తూ ప్రయివేటు బడుల  విద్యార్థులు సాయంత్రం బయట ట్యూషన్లకు తప్పనిసరి వెళ్ళేలా చేస్తున్నారు. ప్రయివేటు బడులలో విద్యార్థులు క్రీడలకు,సృజనాత్మక కార్యక్రమాలకు దూరమై తమ బాల్యం కోల్పోతూన్నారు.ప్రయివేటు బడులలో సి.సి.ఇ. కానీ ఇతర ఆధునిక విద్యాశిక్షణలు పొందని ఉపాధ్యాయులచే బోధన కొనససాగటం వలన వారు పై తరగతులలో ,కాంపిటేటివ్ పరీక్షలలో విఫలమవుతున్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హామీ అందని ద్రాక్షగా మారింది. ఇంటర్ విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు ఇంకా అందివ్వలేదు. సొంత భవనాలు లేవు. ప్రయోగశాలల నిర్వహణకు నిధులు లేవు. లెక్చరర్స్ లేరు. మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల వుండాల్సిన రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు మూతబడే దోశకు చేరుకున్నాయి. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి.రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుండి ఫీజు రీయంబర్స్ మెంట్స్& స్కాలర్ షిప్స్ 5,177 కోట్ల రూ.పెండింగులో ఉన్నాయి. వాటిని కనీసం విడుదల చేయడం లేదు. 2024 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పక్షాలు తా‌మున్నాయి.ప్రభుత్వం అభివృద్ధికి నిధులు ఇవ్వటం మాని ఓట్లవేటకు దోహదపడే కార్యక్రమంలో వుంది. సమాజంలో అత్యంత ప్రధానమైన ప్రభుత్వ విద్యను ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా రాష్ట్రం లోని మరో ఎనిమిది విద్యార్థి సంఘాలు నేడు విద్యా సంస్థల బందుకు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలోని  పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యాశాలలను దూరం చేస్తూ ప్రయివేట్ రంగంలో విద్యను ప్రొత్సాహిస్తున్న ప్రభుత్వ విధానాలపై విద్యార్థులు నిరసన గళం వినిపిస్తున్నారు. విద్యారంగ వ్యతిరేక విధానాలపై తెలంగాణ సమాజం తమ పోరాటాలకు మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వ విద్యా రంగాన్ని బతికించుకోవటంలో సహకారం అందించాలని కోరుతున్నారు…
-అర్జున్
తొమ్మిది విద్యార్థి సంఘాల పక్షాన
పి.డి.ఎస్.యు.వరంగల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *