Take a fresh look at your lifestyle.

హిమాచల్‌కు భారీ వర్ష సూచన

  • ఇళ్లలోంచి బయటకు రావద్దని హెచ్చరికలు
  • 13 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ‌కొనసాగింపు
  • ఉధృతంగా బియాస్‌ ‌నది…వరదల్లో కొట్టుకుపోయిన కార్లు

సిమ్లా, జూలై 10 : హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడడంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో హిమాచల్‌లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అధికార యంత్రాంగాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్‌విందర్‌ ‌సింగ్‌ అ‌ప్రమత్తం చేశారు. అధికారులందరూ అలర్ట్‌గా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ఇండ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అధికారులకు, పోలీసులకు స్థానికులు సహకరించాలని కోరారు. మూడు హెల్ప్ ‌లైన్‌ ‌నంబర్లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 1100, 1070, 1077 నంబర్లకు కాల్‌ ‌చేయాలని సూచించారు.

ఈ నంబర్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో 10 నుంచి 13 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ‌కొనసాగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మరణించినట్లు సీఎం పేర్కొన్నారు. బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, సౌకర్యాలు కల్పించాలని అధికారులను సీఎం సింగ్‌ ఆదేశించారు.చండీఘడ్‌, ‌జూలై 10 :  హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌హర్యానా రాష్టాల్లో్ర మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రధాన నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇక హిమాచల్‌ ‌లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. హిమాలయాల్లో ఉన్న నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. మనాలి వద్ద ఉన్న బియాస్‌ ‌నది ఉప్పొంగుతోంది. వేగంగా ప్రవహిస్తున్న ఆ నది ధాటికి.. టూరిస్టులకు చెందిన కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి.

మనాలిలో బియాస్‌ ‌నది సపంలో పార్క్ ‌చేసిన కార్లన్నీ ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నీరు, బురద ఒక్కసారిగా కొట్టుకురావడంతో.. కార్లు కూడా ఆ బురద నీటిలోనే మాయం అయ్యాయి.  ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. విపత్తు వేళ సహాయక దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రం హిమాచల్‌ ‌ప్రదేశ్‌  ‌భారీ వర్షాలకు తలాకుతలమైంది. రాష్ట్రంలో ప్రధానమైన బియాస్‌ ‌నది ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌  ‌వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో మండి జిల్లాలోని నగ్‌ ‌వయిన్‌ ‌గ్రామ సపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బియాస్‌ ‌నదిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సాహసోపేతమైన ఆపరేషన్‌ ‌చేపట్టింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో జిప్‌ ‌లైన్‌ ఏర్పాటు చేసి కేబుల్‌ ‌సాయంతో నదిలో చిక్కుకున్న ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది.

Leave a Reply