సంయమనం పాటించాలని ఈసీ నోటీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25 : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 30న బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన చీఫ్ ఎలక్షన్ అధికారి భారత ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ ఈసీఐ అడ్వైజరీ కమిటీకి లేఖ రాశారు.
కేసీఆర్‌కు లేఖ పంపాలని అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. దీంతో ఈసీఐ ఆదేశాల మేరకు శుక్రవారం అర్థరాత్రి కేసీఆర్‌కు సీఈవో వికాస్ రాజ్ లేఖను పంపించారు. కాగా..బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ సీఈసీకి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.





