మొంథా తుపాన్‌పై అప్రమత్తంగా ఉండండి

– ధాన్యం తడవకుండా చూడాలి
– రైతులను ఇబ్బంది పెడితే ఉపేక్షించం
– మంత్రి ఉత్తవమ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: మొంథా తుపాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోనూ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద ఆ ప్రభావం పడకుండా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంపైనా తుపాన్‌ ప్రభావం పడే ప్రమాదం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వానాకాలం ధాన్యంతోపాటు మొక్కజొన్న పంటలు దెబ్బ తినకుండా ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించింది. అందులో భాగంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్‌, కమిషనర్‌ గోపి, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌ హనుమంతు కొండుబా, డైరెక్టర్‌ మార్కెటింగ్‌ లక్ష్మీబాయిలతో కలిసి ఎంసీహెచ్‌ఆర్‌డీలో పౌర సరఫరాల శాఖాధికారులతో సమీక్ష సమావేశం, జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతాంగం నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న టార్బాలిన్‌లను వినియోగించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యాం తడవకుండా చూడాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చెయ్యాలని, అందుకవసరమైన రవాణా వసతి ఏర్పాటు చేయాలన్నారు. 30 నుండి 45 రోజుల వరకు ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయాలని సూచించారు. అకాల వర్షాలు సంభవిస్తున్న నేపథ్యంలో వరి కోతలు నిలిపివేస్తే రైతులకు ఇబ్బంది ఉండదని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించగా ఇప్పటివరకు 4,428 కేంద్రాలు ప్రారంభించామని, మిగిలిన 3,814 కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 22,433 మంది రైతుల నుండి ప్రభుత్వం 1,80,452 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని, అందులో దొడ్డు రకం 73,628 మెట్రిక్‌ టన్నులు, సన్నాలు 1,06,824 మెట్రిక్‌ టన్నులు ఉందని తెలిపారు.
కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.431.09 కోట్లు కాగా, కొనుగోలు చేసిన ధాన్యానికి త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ జరపాలన్నారు. కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాధికారులు సందర్శించి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో అవినీతి చోటుచేసుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇది రైతుపక్ష పాత ప్రభుతమని, ఏ కారణం చేతనైనా రైతులకు నష్టం వాటిల్లితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదశ్రీతీ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *