జాతీయ స్థాయి గుర్తింపునకు చర్యలు
సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు
ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : మేడారం జాతరను జాతీయ హోదా పండుగగా గుర్తించలేమంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి జాతీయహోదా అంటూ ఏదీ లేదన్నారు. మేడారం జాతరపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని రాష్ట్ర నేతలు అడుగుతు న్నారని, కానీ..జాతీయ పండుగ అనే విధానం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. అయితే మేడారానికి జాతీయ గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. కిషన్ రెడ్డి గురువారం రోజున మేడారంలో సారలమ్మను దర్శించుకొని నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ…ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడిపంటలతో దేశమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా తెలిపారు. ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ ఏడాదే ప్రవేశాలకు అనుమతిస్తామని వెల్లడిరచారు. ఇందులో ఎక్కువ సీట్లుస్థానిక గిరిజన బిడ్డలకే ఇస్తామన్నారు.
రూ. 900 కోట్లతో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నామని..వర్సిటీ భవనాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత అశోక్ మాట్లాడుతూ…మేడారం జాతరపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని మండిపడ్డారు. జాతీయ హెదా అనేది ఇక్కడి ప్రజల చిరకాల డిమాండ్ అన్నారు. ఆదివాసీల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ…బీజేపీకి గిరిజనులపై ప్రేమ లేదన్నారు. బీజేపీ కపట ప్రేమ బయటపడిరదని మండిపడ్డారు. మేడారంపై బీజేపీ వైఖరి దుర్మార్గమన్నారు. కిషన్ రెడ్డి మూర్ఖంగా మాట్లాడారని…బీజేపీది ద్వంద్వ వైఖరి అంటూ విరుచుకుపడ్డారు. మహబూబాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ..మేడారానికి జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంటులో కొట్లాడినమని తెలిపారు. జాతీయ హోదా ఇస్తే ప్రపంచ గుర్తింపు వొస్తుందన్నారు. అమ్మవార్లకు గౌరవం దక్కాలంటే జాతీయ హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు.





