‌పుంజుకుంటున్న డేటా సైన్స్ ‌రంగం

గ్రామినార్‌ ‌డేటా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌
‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : భారత్‌లో డేటా సైన్స్‌కు గత ప్రభుత్వాలు తక్కువ ప్రాధాన్యం ఇచ్చాయని మంత్రి •టిఆర్‌ అన్నారు. దేశంలో డేటా సైన్స్ ‌రంగం వేగంగా పుంజుకుంటుందన్నారు. సాంకేతికత ద్వారా సమాజంలో విప్లవాత్మక మార్పులు వొస్తాయని తెలిపారు. నానక్‌రామ్‌గూడ వన్‌ ‌వెస్ట్‌లో గ్రావి•నర్‌ ‌డేటా సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ..ఒక్క రోజులోనే సమగ్ర సర్వే వంటి అతిపెద్ద డేటా ప్రాజెక్టు చేపట్టామని గుర్తు చేశారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం డేటా సైన్స్ అవసరమని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. మున్సిపల్‌ ‌శాఖలో పలు ప్రాజెక్టులకు గ్రావి•నర్‌తో కలిసి పని చేస్తామని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *