నిరుద్యోగాన్ని పెంచిన బీజేపీ ఆర్థిక అజెండా!

మన ముందున్న సవాలు నిరుద్యోగ సమస్య. యువతకు చేతి నిండా పనిక ల్పించాలి. వారికి ఉపాధి కావాలి.. వారు పస్తులుండరాదు. లేదంటే సమాజంలో అశాంతి తప్పుదు. నిరుద్యోగం ప్రబలిందంటే, దేశంలో అశాంతి పెరుగుతుంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఊహాజనితమైన విధానాలకు స్వస్తి  చెప్పి, వాస్త వంలోకి వొచ్చి నిరుద్యోగ మహమ్మారిని తరిమిగొట్టి యువతకు ఉద్యోగాలు కల్పించి వారి నుంచి అశాంతిని దూరం చేయాలి.  

సరిదిద్దుకోకపోతే, ఎగసిపడనున్న అశాంతి జ్వాలలు

బీజేపీకి తాజా పార్లమెంటు ఎన్నికల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 240 సీట్లకు దిగజారిన బీజేపీ
తనను తాను ఆత్మవిమర్శ చేసుకునే సమయం ఆసన్నమైంది. నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది. రైతాంగ
సంక్షోభానికి అంతేలేదు. దీనికి తోడు రిజర్వేషన్ల సమస్య. ఈ కారణాల వల్లనే బీజేపీ గ్రాఫ్‌ పడి పోయిందని ది తక్ష
శిల ఇనిస్టిట్యూషన్‌ సహ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ నితిన్ పాయ్‌ పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి వాస్తవమే. మిలిటరీ
రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అగ్నిపథ్‌ స్కీంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కేంద్రంలో కొలువుతీరిన ఎన్డీయే సర్కార్‌
సమూలాత్మకమైన మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నిరుద్యోగ సమస్యను సాధారణ సమస్యగా
చూడవొద్దు. ఒక్కోసారి తాడు కూడా పాముగా మారి కాటేస్తుంది. ఎందుకంటే దేశంలో నిరుద్యోగ సమన్య తీవ్రంగా
ఉందని అనేక ఆర్థిక సంస్థలు సర్వేల్లో సూచించాయి. బీజేపీ నేతలు ఇవేమీ పట్టించుకోలేదు. తమకు వోటు బ్యాంకు
బలంగా ఉందని గుడ్డిగా నమ్మి బోల్తా పడ్డారు. ప్రజలు ఎక్కువ కాలం ఒక వ్యక్తి ఒక నినాదం పట్ల నమ్మకంతో
ఉండరు. వారి మనుగడకు దెబ్బతగిలితే, కచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చేస్తారు. లేదంటే షాక్‌ ఇస్తారు.

దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తోంది. నిజమే. ఎవరు కాదన్నారు. కానీ నిరుద్యోగ సమస్యను అరికట్టడంలో విఫలమైంది.
రైతాంగ సమస్యలను పట్టించుకున్నారా? ప్రతి ఏటా 20 మిలియన్ల ఉద్యోగాలను కల్పించాలి. ఎనిమిది మిలియన్ల
రైతాంగ బాధలను పరిష్కరించాలి. తైవాన్‌, నెదర్లాండ్స్, శ్రీలంక జనాభా ఎంత ఉందో అంత మంది నిరుద్యోగులు
మనదేశంలో ఉన్నారు. వికసిత భారత్‌ నినాదం ఇచ్చారు. వాస్తవంలో అందుకు విరుద్దమైన పరిస్థితులు దేశంలో నెల
కొని ఉన్నాయి. ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని బీజేపీ నేతలు కనిపెట్టలేకపోయారు.

మిలిటరీ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారానే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కాదు. కేంద్ర, రాష్ట్రప్రభు
త్వాల్లో లెక్కలేనంత సంఖ్యలో ఉద్యోగాలు ఖాలీగా ఉన్నాయి. ఎకానమీలో కూడా ఎక్కడో తెలియని లోటు కనపడు
తోంది. అగ్నిపథ్‌ పట్ల యువకుల్లో నెలకొన్న తీవ్రమైన అసంతృప్తిని తొలగించాల్సిన బాధ్యత కేంద్రానిదే. నిరుద్యోగ
సమస్యను పరిష్కరించేందుకు అనేక మార్గాలను ఆన్వేషించి అమలు చేయాల్సిన గురుతర బాధ్యత కేంద్రంపై
ఉంది. నగరాలను అభివృద్ది చేయాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. మనకు మంచి నగరాలు కావాలి. ఈ నగ
రాల్లో అద్భుతమైన ప్రజాసేవల విధానాలను అమలు చేయాలి. నిర్మాణ రంగం ఊపందుకుంటుంది. పర్యావరణ
పరిరక్షణ విధానాలు అమలు చేయాలి. జనంతో కిటకిటలాడుతున్న నగరాలకు సమీపంలో కొత్త రాజధానులను
నిర్మించాలి. మిలిటరీ స్టేషన్లను మార్చాలి. కొత్త వర్శిటీలను నెలకొల్పాలి. సృజనాత్మకతతో కూడిన క్రియాశీల ,
వినూత్నమైన విధానాలను అమలు చేయాలి. నైపుణ్య రంగాన్ని అభివృద్ధి చేయాలి.

పరిశ్రమలను నెలకొల్పాలి. రోబొటిక్స్‌, ఇంటెలిజెన్స్‌ ఐటీ రంగం విస్తరిస్తున్నా పరిశ్రమలను విరివిగా నెలకొల్పాలి.
మహదేవ్‌ గోవింద రణాడే, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ లాంటి మహనీయులు పారిశ్రామికీకరణ అవసరమన్నారు.
1890, 1920లోనే వారు ఈ అంశాలపై నినదించారు. వ్యవసాయ రంగం నుంచి సేవా రంగానికి ఉన్నట్టుండి
భారత్‌ మారే అవకాశం లేదు . మనం క్రమపద్ధతిలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది చేసుకుని, ఆ తర్వాత సేవా రంగం
లోకి రావాలి. పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా విస్మరించడం వల్ల నిరుద్యోగం ప్రబలుతోంది. గ్రామీణ ప్రాంతాల
నుంచి వలసలు పెరిగాయి. నగరాల్లో నిరుద్యోగులకు చోటు లేదు. ఆర్థిక మాంద్యం విలయతాండవం చేస్తోంది.
బతుకు బండి ఈడ్చడం గగనంగా మారింది. పారిశ్రామిక రంగం చతికిలపడింది. గత మూడు దశాబ్దాలుగా చైనా
ఎంత అభివృద్ధి చెందినా, పారిశ్రామిక రంగాన్ని వదలలేదు. అందుకే విశ్వ ఆర్థిక రంగంలో చైనా ముందంజలో
ఉంది. మనం వాస్తవంలో ఉండి … ఆత్మన్యూనతా భావం అక్కర్లేదు. చర్చ జరగాలి. ఆత్మ విమర్శ చేనుకోవాలి. భేష
జాలు వద్దు. లోపాలను సరిదిద్దుకునేందుకు సిద్ధం కావాలి.

మహిళలను అభివృద్దిలో భాగస్వాములును చేయాలి. మహిళలు క్రియాశీల పాత్ర వహించే విధంగా చర్యలు తీసుకో
వాలి. ప్రణాళికలను రచించాలి. మహిళల భాగస్వామం తగ్గుతోంది. ఇది ఆందోళన కరమైన విషయం. ఏం చేస్తే
మహిళలు ఉత్సాహంగా సమాజాభివృద్ధిలో భాగస్వాములవుతారనే అంశంపై కేంద్రం ఆలోచించాలి. వారు పనిచేసే
ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. పబ్లిక్‌ (టాన్స్‌పోర్టు విస్తృతం చేయాలి. శిశు సంరక్షణ, టాయిలెట్టు,
వీధి దీపాలు, శాంతి భద్రతలు, గృహోపకరణ వస్తువులు అన్నింటినీ అందుబాటులోకి తేవాలి. మహిళలు పనిచేసే
ప్రదేశాల్లో ఇవన్నీ ఉండాలి. వినూత్నమైన రీతిలో భారీ ఎత్తున సంస్కరణలు తేవాలి.

స్వేచ్చా వాణిజ్య విధానాలను ప్రోత్సహించాలి. దేశాభివృద్ధికి అభివృద్ది అజెండాను నిర్దేశించాలి. మన ఆర్థిక విధానా
లను పునసమీక్షించుకుని లోటుపాట్లను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలి. సిగ్గుపడి చేతులు ముడుచుకుని కూర్చుంటే
దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. మన ముందున్న సవాలు నిరుద్యోగ సమస్య. యువతకు చేతి నిండా పనిక
ల్పించాలి. వారికి ఉపాధి కావాలి.. వారు పస్తులుండరాదు. లేదంటే సమాజంలో అశాంతి తప్పుదు. నిరుద్యోగం ప్రబ
లిందంటే, దేశంలో అశాంతి పెరుగుతుంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఊహాజనితమైన విధానాలకు స్వస్తి చెప్పి, వాస్త
వంలోకి వొచ్చి నిరుద్యోగ మహమ్మారిని తరిమిగొట్టి యువతకు ఉద్యోగాలు కల్పించి వారి నుంచి అశాంతిని దూరం
చేయాలి.
-ప్రజాతంత్ర డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *