తెలంగాణపై విషం చిమ్ముతున్న ప్రధాని మోదీ

కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట ముంచుతారు
ఆరు హామీలు కాదు ..6 గురు ముఖ్యమంత్రులు ఖాయం…
6 నెలల పాటు కర్ఫ్యూ, 6 గంటలు మాత్రమే కరెంట్‌
ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు
కాంగ్రెస్‌ ‌నాయకులదంతా అసత్య ప్రచారాలు
వారు అధికారంలోకి వస్తే ఆరు  నెలలకో సిఎం
నారాయణ్‌ ‌ఖేడ్‌ ‌నియోజకవర్గ కార్యక్రమాల్లో హరీష్‌ ‌విమర్శలు

సంగారెడ్డి,ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవకాశం వొస్తే తెలంగాణపై విషం చిమ్ముతారని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ – ఏపీ విడిపోయినప్పుడు సంబరాలు చేసుకోలేదని మోదీ చెప్పారు. మోదీ కడుపులో ఉన్న విషాన్ని ఇప్పుడు బయటికి కక్కుతున్నారు. మనకి రావాల్సిన ప్రాజెక్టును ఆంధ్రకు తీసుకుపోయారు. బీజేపీవి అన్ని అబద్ధాలే.. మాకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చారా.. తెలంగాణపై విష ప్రచారాలు మానుకోవాలి. కాంగ్రెస్‌ ‌నాయకులదంతా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. నారాయణ్‌ ‌ఖేడ్‌ ‌నియోజకవర్గం శంకరంపేటలో వంద డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లను మంత్రి హరీష్‌ ‌రావు ప్రారంభించారు. మొత్తం 350 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్లాట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ… కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇచ్చిన హావి•లు నెరవేర్చిన తర్వాత తెలంగాణకు వచ్చి మాట్లాడాలంటూ సూచించారు. కాంగ్రెస్‌ ‌గెలిస్తే 6 నెలలకు ఓ సీఎం మారతారంటూ సెటైర్లు వేశారు.కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 నెలల్లో హావి•లు అమలు కావని.. కానీ ఆరు నెలలకు ఒక కొత్త సీఎం మాత్రం ఉంటాడని ఎద్దేవా చేశారు. 6 నెలల పాటు కర్ఫ్యూ, 6 గంటలు మాత్రమే కరెంట్‌ ఉం‌టుందంటూ విమర్శించారు. ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకమాండ్‌ అవుతుందని.. వారానికి రెండు పవర్‌ ‌హాలిడేలు ఉంటాయని చెప్పారు. పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసి, ఆత్మగౌరవంతో జీవించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కృషి చేశారని తెలిపారు. పేద ప్రజలకు ఇళ్లు, ప్లాట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ ‌మాట ఇస్తే కచ్చితంగా చేస్తాడని చెప్పుకొచ్చారు. నారాయణ్‌ ‌ఖేడ్‌ ‌లో ఇచ్చిన హావి• మేరకు… అన్నీ చేసి చూపించాడన్నారు. అలాగే పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వందలాది మందికి సొంతింటి కలను నిజం చేశారని మంత్రి హరీష్‌ ‌రావు వెల్లడించారు.

కర్ణాటకలో ప్రస్తుతం 600 రూపాయల పింఛన్‌ ఇస్తున్నారని.. విద్యుత్తు అంతరాయాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వికలాంగులకు 1000, రైతు బంధువులకు 10 వేలు ఇస్తున్నామని కాంగ్రెస్‌ ‌చెబుతున్నదంతా అవాస్తవం అని పేర్కొన్నారు. అధికారంలోకి రావాలని తెలంగాణలో నోటికి వచ్చి హావి•లు ఇస్తున్నారని చెప్పారు. కాళేశ్వరానికి నీళ్లు ఇస్తాం, శంకరంపేటలో ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తాం అని వివరించారు. తెలంగాణకు రెండో రాజధానిగా బెంగళూరును తీర్చిదిద్దనున్నారంటూ వ్యాఖ్యానించారు. బెంగళూరు వి•దుగా ఢిల్లీ వెళ్లాలని అన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ‌హావి•ని నెరవేర్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ‌హావి•లు సంతకం లేని పోస్ట్ ‌డేటెడ్‌ ‌చెక్కు లాంటివని చెప్పుకొచ్చారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టో విడుదల అవుతుందని మంత్రి హరీష్‌ ‌రావు వెల్లడించారు. తెలంగాణ కోసం పోరాడి చావు అంచుల దాకా వెళ్లి మరీ సీఎం కేసీఆర్‌ ‌రాష్టాన్న్రి సాధించగలిగారని వివరించారు. అలాగే భూపాల్‌ ‌రెడ్డి మంచి నాయకుడు అని… నిత్యం ఆయన ప్రజల్లోనే ఉంటారని తెలిపారు. ప్రజలంతా బీఆర్‌ఎస్‌ ‌కు ఓటేసి భూపాల్‌ ‌రెడ్డిని గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు, నారాయణ ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కర్ఫ్యూ ఉంటుంది.. ఏం నిర్ణయం తీసుకోవాలన్న కాంగ్రెస్‌ ‌నేతలు హై కమాండ్‌ ‌పర్మిషన్‌ ‌తీసుకోవాలని మంత్రి హరీష్‌రావు సెటైర్లు వేశారు.కాంగ్రెస్‌ ‌నమ్మితే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టేనని.. కాంగ్రెస్‌ ఓ ‌జూటాపార్టీ అంటూ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

నారాయణ్‌ ‌ఖేడ్‌ ‌నియోజకవర్గంలో రూ.18.23 కోట్లతో కంగ్టి నుంచి కర్ణాటక బార్డర్‌ ‌బార్డర్‌ ‌వరకు రహదారి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌మాట మార్చిందని.. గెలిస్తే మహిళలకు ఉచిత బస్‌ అని చెప్పి.. బంద్‌ ‌చేశారన్నారు. కరెంట్‌ ‌చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. కర్ణాటకలో ఇక్కడ అమలు చేస్తున్న కేసీఆర్‌ ‌కిట్‌, ‌రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు లేవని.. ఇక్కడికి వచ్చి ఉద్దరిస్తామంటున్నారంటూ విమర్శించారు. తండా తండాకు నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దని, గల్లీ గల్లీలో బారాన మందం రోడ్లు వేశామన్నారు. సీఎం కేసీఆర్‌ ‌రైతు గౌరవాన్ని పెంచారని, అందుకే తెలంగాణలో భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. కర్ణాటకలో దిక్కు లేదని, ఈసారి భూపాల్‌ ‌రెడ్డి గెలిస్తే బసవేశ్వర ప్రాజెక్ట్ ‌ద్వారా వి• ఇంటి ముందుకు నీళ్లు తెస్తామన్నారు. 70 సంవత్సరాల కాంగ్రెస్‌ ‌పాలనలో తాగేందుకు నీరు ఇవ్వలేదని, తాము తాగునీటితో పాటు సాగునీటిని సైతం అందిస్తామన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని, పాలన ప్రజలకు చేరువ కావాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష. అందులో భాగంగానే కొత్త జిల్లాలు, గ్రామాలు, మండలాలను ఏర్పాటు చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. కాంగ్రెస్‌ ‌పాలనలో వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంట్‌ అన్నడు. అది ఉత్త కరెంట్‌ అయ్యింది. నాడు కాలిపోయే మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ ‌ఫార్మర్లు మాత్రమే దర్శనమిచ్చేవని ఆ పార్టీపై మండిపడ్డారు.

నారాయణఖేడ్‌ ‌నియోజకవర్గం, తడ్కల్‌ ‌మండలంలో మైనార్టీ ఫంక్షన్‌ ‌హాల్‌ను ప్రారంభించారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన పలువురు నేతలు గులాబీ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..30 ఏండ్ల మండం ఏర్పాటు కలను నిజం చేసింది సీఎం, ఎమ్మెల్యే భూపాల్‌ ‌రెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలో నారాయణ్‌ ‌ఖేడ్‌ ‌రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. రెవెన్యూ డివిజన్‌ అయింది. కొత్త మండలాలు అయ్యాయి. 100 కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. మొత్తం 223 గ్రామ పంచాయతీలు అయ్యాయి. రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 43 నుంచి 74 వరకు, మండలాల సంఖ్యను 459 నుంచి 612 వరకు, గ్రామ పంచాయతీల సంఖ్యను 12,769 వరకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. న్నతల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తడటని ఎద్దేవా చేశారు. భుజాలు నొప్పి పెట్టేలా నాడు మహిళలు నీళ్లు మోసారు. నేడు ఇంటింటికీ మిషన్‌ ‌భగీరథ నీళ్లు ఇచ్చింది కేసీఆర్‌. ‌లక్ష రూపాయల రుణమాఫీ కొనసాగుతున్నది. అర్హులందరికీ మాఫీ అవుతాయని చెప్పారు. మాట చెబితే మడమ తిప్పని పార్టీ బీఆర్‌ఎస్‌ అని స్పష్టం చేశారు. అభివృద్ధి చేస్తున్న బీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *