అందుకు ఇందిరాగాంధీ నిదర్శనం
కోటీశ్వరులను చేయాలన్నదే నా లక్ష్యం
వీ హబ్ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమంలో సిఎం రేవంత్
హైదరాబాద్,ప్రజాతంత్ర,మే17: మహిళలే దేశానికి ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వీహబ్ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు- చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ..కోటిమంది మహిళలు కోటీశ్వరులు అయితే, ఆర్థికంగా రాష్ట్రం కూడా అభివృద్ది చెందుతుందని అన్నారు. మహిళా శక్తిని ప్రపంచానికి ఇందిరాగాంధీ చూపించారు. రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ల ఎకానవి• చేరుకోవాలంటే కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలి. మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం తీసుకొచ్చాం. ఆడబిడ్డలకు రూ.500కే సిలిండర్ అందిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను మహిళలకే అప్పగించాం. ఈ నెల 21న ఇందిరా మహిళ స్టాళ్లను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారు. సెర్ప్ సభ్యుల సంఖ్యను కోటి మందికి చేర్చాలి. కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు ఇస్తే తీసుకొని పలువురు దేశం విడిచి పారిపోతున్నారు. మహిళలకు ఇచ్చే ప్రతి రూపాయి వడ్డీతో సహా చెల్లిస్తున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు- చేసిన స్టాళ్లను పరిశీలించారు. మహిళలే దేశానికి ఆదర్శం అని అన్నారు. మహిళలు కోటీశ్వరులు కావాలని, మహిళలకు అండగా నిలబడతానని, ఆర్థికంగా ఎదగండని రేవంత్ రెడ్డి సూచించారు. మహిళలు ఆర్థిక శిక్షణ పాటిస్తున్నారని, ఆడబిడ్డలను ప్రోత్సహించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఆడబిడ్డలు వ్యాపారంలో నిలదొక్కుకుంటే.. కుటుంబాలు ఆర్థికంగా బాగుంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఒక యూనిక్ ఐడి కార్డు ఇస్తామని, మహిళల ఆరోగ్యం నుంచి సంపాదన వివరాలన్నీ తెలిపేలా యూనిక్ ఐడి కార్డు లభిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మహిళలే దేశానికి ఆదర్శం



