‘‘అమ్మ కడుపులో పడినప్పుడు ఆడ శిశువునని, అమ్మాయిగా ఉన్న ప్పుడు కామ పిశాచులతో, అమ్మగా మారినప్పుడు మగ శిశువును కనలేదని, పుట్టిం టికి వెళ్లాలంటే పది ప్రశ్నలు, నచ్చింది కొనాలంటే వంద అనుమతులు. మహిళల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు భర్తల ఆంక్షల మధ్య ఆవిరి అవుతున్నాయి ‘‘ ఇది నేటి సామాన్య మహిళా ముఖ చిత్రం. అందరి పరిస్థితి ఇలా ఉండకపోవచ్చు. కొందరి విష యంలో మాత్రం ఇది నిజం ! ఇలా చెప్పుకుంటే చాలా రంగాలలో మహిళలు వివక్షతకు గురవుతూనే ఉన్నారు. ఇది ఇక్కడితోనే ఆగడం లేదు. ఆర్థిక స్వాతంత్రం ఉన్నా ఖర్చు చేయడం మాత్రం మగవారి కనుసన్నల్లోనే!మహిళలు రాజకీయ పద వులకు ఎన్నికైనా కొంతమంది విషయంలో అధికారం చలాయించేది మాత్రం వారి ప్రతి నిధులే! అధిక శాతం సమాజంలో కనిపిస్తున్న తీరు.
ఇంకా ‘‘ అత్తని, ఆడపడుచుని తన అమ్మలా చూసుకోని కోడళ్ళూ ఉన్నారు. అదే సమయంలో కోడలని తన కూతురులా భావించని అత్తలూ ఉన్నారు. ఇద్దరూ మహి ళలే ‘‘ ! ఇక్కడ ఎవరిని అక్షేపించడం లేదు. ఇది ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొంత మంది మహిళల అగచాట్ల వాస్తవాలకు అక్షర రూపం. మహిళ అవసరం లేని వాణిజ్య ప్రకట నలలో కూడా మహిళలనే చూపి స్తున్నారు. కొంతమంది పురుషుల పదునైన చూపులకు ఆరేళ్ళ నుండి అరవై ఏళ్ల వరకు వయసున్న మహిళలు భయపడుతున్నారు. ఏ వార్తలు విన్నా ఏమున్నది గర్వకారణం ! ప్రతీ రోజు దేశంలో ఎక్కడో ఒక దగ్గర కామాం ధులకు ఓ ఆడది బలై పోతూనే ఉంది. ఇది ఇప్పటి సమస్య కాదు. అనాదిగా మహిళలు అనుభవిస్తున్న వ్యధ.
ఈ ఒక్కరోజే మాత్రమేనా ?
ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వాస్తవం చెప్పాలంటే సమాజం ఈ ఒక్క రోజు మాత్రమే స్త్రీల గురించి ఆలోచిస్తుంది. తరువాత షరా మామూలే. ఈ రోజు మహి ళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ విజయాలను జరుపుకునే ప్రపంచ మహిళా దినోత్సవం. మహిళా సాధికారిత సాధిం చాలంటే రాజకీ యంగా, విద్యా పరంగా, ఆర్థికంగా, సామాజికంగా, భౌతికంగా రాటు తేరాల్సిందే. రా జ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ అన్నట్లు ‘‘సామాజిక పురోగతికి రాజకీయ అధికారమే కీలకం’’. సాధికారత అంటే ఒకరి దయా దాక్షిణ్యాల, అనుమతుల మీద ఆధారపడాల్సిన అవసరంలేని స్వతంత్ర వైఖరితో ఇతరులతో సమాన స్థాయిలో వ్యవహరించగలగడం, నిర్ణయాలు తీసుకో గలగడం. భావజాలపరమైన అడ్డుగోడలు లేకుండా సామాజిక వాతావరణం కలిగి ఉం డడం. స్త్రీవాదం కేవలం స్త్రీలకు సంబంధిం చినదే కాదు. దీనికి అందరి సహాయ సహకారాలు అవసరం. సమానత్వం కోసం మహిళల పోరాటం ఏ ఒక్కరి లేదా ఏ ఒక్క సంస్థకు చెందినది కాదు. మానవ హక్కుల గురించి పట్టించుకునే వారందరి సమిష్టి కృషికి సంబంధించినది. మహిళా సాధికారత అనేది కేవలం సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఇది ఆర్థిక అనివార్యం కూడా. ప్రతి మహిళ విజయం మరొకరికి స్ఫూర్తిగా ఉండాలి. ఒకరినొకరు ఉత్సా హపరిచినప్పుడు మాత్రమే బలంగా ఉంటారు.
ఆరోగ్యం అవసరం !
ఆరోగ్యమే నిజమైన సంపద. బంగారం, వెండి ముక్కలు కాదు. స్త్రీకి ఆరోగ్యమే మూలధనం. ఎందుకంటే ఏది సాధించాలన్నా ఆరోగ్యం అవసరం. గత రెండు శతాబ్దాలుగా పురుషులు, మహిళలు ఇద్దరికీ ఆయుర్దాయం పెరిగినప్పటికీ సగటున స్త్రీలు తమ జీవితాల్లో పురుషుల కంటే నాల్గవ వంతు ఎక్కువ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మహిళా సాధికారిత సాధించే సమయంలో విద్య, వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరిన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా, సమాజంలో పూర్తిగా పాల్గొనకుండా నిరోధించే అడ్డం కులను విచ్ఛిన్నం చేయాలి. మహిళలు అధి కారం సాధించేకొద్దీ అడ్డంకులు తగ్గుతాయి. మహిళల హక్కులు, లింగ సమానత్వం సాధించడానికి మహిళల ఆర్థిక సాధికారత అవసరం. మహిళలు, బాలికల విద్యాసాధనను పెంపొం దించడం మహిళల ఆర్థిక సాధి కారతకు మరింత సమగ్రమైన, పర్యా వరణపరంగా స్థిరమైన ఆర్థిక వృద్ధికి దోహ దపడుతుంది.
ఇంకా 149 వ స్థానమేనా ?
ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ నిర్వహి ంచిన పరిశోధనలో పార్లమెంటు దిగువ సభలో పనిచేసే మహిళల శాతం పరంగా భారతదేశం 193 దేశాలలో 149వ స్థానంలో ఉంది. జనాభాలో సగం మంది మహిళలు ఉన్న దేశంలో, భారతదేశంలో లోక్‌సభలో 13.6%, రాజ్యసభలో 16.8% ప్రాతినిధ్యం ఉంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్2023లో ప్రపంచంలో మొత్తం 146 దేశాలలో 127వ స్థానంలో ఉన్న మన దేశం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 2024లో రెండు స్థానాలు దిగజారి 129వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుత పోకడలు ఇలాగే కొనసాగితే 2030 నాటికి 34.2 కోట్ల కంటే ఎక్కువ మంది మహిళలు బాలికలు అత్యంత పేదరికంలో జీవించే అవకాశం ఉంది.
ఎన్నో సవాళ్లు ! మరెన్నో సమస్యలు:
లింగ సమానత్వం మహిళల సమస్య మాత్రమే కాదు! ఇది మానవ హక్కుల సమస్య కూడా ! ప్రపంచవ్యాప్తంగా 37 శాతం మహిళల మాత్రమే. ఇంటర్నెట్‌ను ఉపయోగించని వారితో డిజిటల్ విభజన లింగపరంగానే ఉంది. అంటే పురుషుల కంటే 25.9 కోట్ల తక్కువ మంది మహిళలు ఇంటర్నెట్‌ను ఉపయో గిస్తున్నారు. విద్యలో లింగ అసమా నతలు, పనిచేసే ప్రదేశంలో లింగ పక్షపాతం, బాల్య వివాహం, వరకట్న సమస్య, లింగ ఆధారిత హింస, సంఘర్షణ, ఆహార అభద్రత, సామాజిక రక్షణ లేకపోవడం వంటి అనేక బెదిరింపులను మహిళలు ఎదుర్కొంటున్నారు. గృహ హింస పనిచేస్తున్న ప్రదేశంలో హింస అనేది మహిళల హక్కుల ఉల్లంఘనే వారి ఆర్థిక భాగస్వామ్యానికి ఆటంకం కలిగిస్తుంది. మహిళల ఆర్థిక సాధికారతలో మానవ హక్కులు ప్రధానమైనవి. అన్యాయమైన, పితృ స్వామ్య ఆర్థిక వ్యవస్థలు లింగ అసమానతను పెంపొందించాయి. వివక్షతతో కూడిన సామాజిక నిబంధనలు మహిళలకు ఉద్యో గాలు, ఆస్తులకు అడ్డుగా నిలుస్తు న్నాయి.1952లో మొదటి లోక్‌సభకు ఎన్నికైన ప్పుడు మహిళలు 4.4% మాత్రమే ఉన్నారు.
పరిష్కారాలు:
మహిళల హక్కులు, లింగ సమానత్వం సాధించడానికి మహిళల ఆర్థిక సాధికారత అవసరం. ఎక్కువ మంది మహిళలు పని చేస్తే, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. మహిళల, బాలికల విద్యాసాధనను పెంపొందించడం మహిళల ఆర్థిక సాధికారతకు మరింత సమగ్రమైన, పర్యావరణ పరంగా స్థిరమైన ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. మహిళల ఆర్థిక సాధికారతను వేగవంతం చేయడానికి దోహదపడే అంశాలను చూస్తే ఆర్థిక వనరులతో మహిళలను అనుసందానించడం వలన వారి ప్రాథమిక అవసరాలను తీర్చ డంలో, వ్యాపారాలను ప్రారంభించడంలో, అభివృద్ధి చేయడంలో వారికి సహాయ పడుతుంది. మహిళలకు ఆర్థిక వనరుల తోపాటు భూమి, సమాచారం, సాంకేతికత, సహజ వనరులు అందుబాటులో ఉండాలి. సైన్స్, టెక్నాలజీ ఇంజినీరింగ్‌తో సహా ప్రస్తుతం వారు తక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్న రంగాలలో మహిళల అర్ధవంతమైన భాగస్వామ్యాన్ని పెంచడం వారి సాధికారతకు కీలకం. ఉపాధిలో లింగ అంతరాలను మూవేయడం ద్వారా ప్రపంచం జిడిపిలో 20 శాతం పెరుగుదలను చూడవచ్చు. ఇంకా మహిళా పారిశ్రామికవేత్తలు విజయవంతం అయినప్పుడు వారు ఉద్యోగాలను సృష్టిం చగలరు. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత చట్టసభలలో సంఖ్య కేవలం 12.15% ఉంది. ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం 74 మంది, రాజ్యసభలో 39 మంది మహిళలు ఉన్నారు. ఇది ఇంకా పెరగాలంటే ఆమోదం పొందినా అమలుకు నోచుకోని చట్టసభలలో మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. గాంధీజీ కలలు కన్నట్లుగా మహిళా అర్ధరాత్రి భయం లేకుండా తిరగడానికి, సమాజంలో సవాళ్లు పరిష్కారానికి సమాజంలో ప్రతి ఒక్కరి సహకారం అవసరం.
కింజరాపు అమరావతి
8247286357





