ప్రాణాలు తీసిన ఉద్యోగ ప్రయత్నం

  • యువ జంట ఆత్మహత్య
  • రూ 16లక్షలు మోసపోయిన దంపతులు
  • ఉద్యోగం రాదనే మనస్తాపంతో బలవన్మరణం

ఉద్యోగాల కోసం డబ్బు చెల్లించాక మోసపోయామని తెలిసి మనస్తాపానికి గురైన ఓ యువ జంట బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక ఘటన కొత్తగూడెం చుంచుపల్లి మండలంలో జరిగింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగం ఇప్పిస్తామని రూ 16 లక్షలు తీసుకుని దలారులు మోసం చేయడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండాకు చెందిన హాలవత్‌ రత్నకుమార్‌, పార్వతి దంపతులు కొత్తగూడెంలోని ఒక వస్త్రాలయంలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు. రత్నకుమార్‌ డిగ్రీ చేయగా, అతని భార్య పార్వతి బిఇడి చదివింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం గంతో ఎంతగానో ప్రయత్నించారు. ప్రస్తుతం చుంచుపల్లి మండలంలోని ఓ షాపింగ్‌ మాహల్‌లో పనిచేస్తూ అక్కడే ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. సింగరేణిలో ఒక ఉద్యోగం ఉందని, తన వద్ద డబ్బు లేదని, కావాలంటే నీకు ఇప్పిస్తా అని సహోద్యోగి రత్నకుమార్‌కు కరీంనగర్‌కు చెందిన ఓ దలారిని పరిచయం చెప్పాడు. త్వరలో రిటైర్‌ కాబోతున్న సింగరేణి కార్మికుడికి కొడుకులు లేరని, ఉద్యోగం అమ్ముకునే ఆలోచనలో ఉన్నారని దలారులు రత్నకుమార్కు చెప్పారు. సదరు కార్మికుడిని మెడికల్‌ బోర్డులో అన్ఫిట్‌ చేయించి, అల్లుడని చెప్పి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి రూ16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

దంపతుల మృతదేహాలు

గడచిన నాలుగు నెలల్లో పలు దఫాలుగా దలారులకు రత్నకుమార్‌ రూ14 లక్షలు ముట్టజెప్పాడు. మిగిలిన రూ 2 లక్షలు ఉద్యోగంలో చేరిన తర్వాత ఇస్తానని దలారులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఉద్యోగం వొస్తే లైఫ్‌ సెటిల్‌ అవుతుందనుకుని ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు రత్నకుమార్‌ తన భార్య బంగారం అమ్మడంతో పాటు తన సోదరుడు, బంధువులు, స్నేహితుల వద్ద కూడా అప్పులు చేశాడు. ఇక సింగరేణి ఉద్యోంగం వొస్తుందనే ధీమాలో ఉన్న రత్నకుమార్‌. అయితే డబ్బులు తీసుకున్న దలారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్న పిడుగులాంటి వార్త విన్న రత్నకుమార్‌ దంపతులు ఒకింత షాక్‌కు గురయ్యారు. మరణించిన దలారిని పరిచయం చేసిన సహోద్యోగిని తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురైన దంపతులు ఉద్యోగం రాదని ఆందోళనకు గురయ్యారు. ఉద్యోంగం కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక సోమవారం భార్యతో కలిసి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని పార్వతి తన తమ్ముడికి ఫోన్‌ చేసి చెప్పగా కుటుంబ సబ్యులు వెంటనే కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు.

పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ తరలించారు. విషయం తెలుసుకున్న రత్నకుమార్‌ సహోద్యోగి పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. దలారి మృతిపై భిన్న కథనాలు వినిపించడం గమనార్హం. అయితే పోలీసుల దర్యాప్తులో వాస్తావాలు వెలుగు చూడాల్సి ఉంది. దీంతో విషయం తెలుసుకున్న చుంచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం మృతి కి ఉద్యోగం కోసం మోసపోయిమని మనో వేదన తోటే ఆత్మహత్య కు పాల్పడినట్లు వారు ఆరోపిస్తున్నారు.

దీంతో జూలురుపాటు మండలం సాయిరాం తండాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సింగరేణి ఉద్యోగం ఇప్పిస్తానని కరీంనగర్‌కు చెందిన వ్యక్తి మాయ మాటలు విని జీతంలో నెల నెలా కొంచెం పోగేసి డబ్బు రూ 16 లక్షలు చెల్లించారు. ఇక ఉద్యోగం వొస్తుందిలే అనుకుని ఎదురుచూడసాగారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ చెందిన వ్యక్తి కి రోడ్డు ప్రమాదం జరిగి అతను మృతి చెందడం తో చేసేది ఏమీ లేక డబ్బులు తిరిగి రావని తెలుసుకోని ఆత్మహత్యే శరణ్యం అనుకుని పురుగు మందు సేవించి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారిని కొత్తగూడెం లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌ కు అక్కడి నుండి ఖమ్మం కు, ఖమ్మం నుండి హైదరాబాద్‌ కు తరలించి నప్పటికి వారిని కాపాడలేక పోయారని బంధువులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *